జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల రాజ్ షమనీ పాడ్‌కాస్ట్‌లో కనిపించినప్పుడు, ఆయన తలకి ఒక చిన్న మెటాలిక్ క్లిప్ ఉండటం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. కొందరేమో అది చూయింగ్ గమ్ అని, మరికొందరు ఛార్జింగ్ ప్యాడ్ అని రకరకాల మీమ్స్ చేశారు. కానీ అది ఒక సీరియస్ హెల్త్ గ్యాడ్జెట్ అని, దాని పేరు ‘టెంపుల్’ అని తర్వాత తెలిసింది.
ఈ ‘టెంపుల్’ పరికరం మెదడుకు వెళ్లే రక్త ప్రవాహాన్ని నిరంతరం ట్రాక్ చేయడానికి డిజైన్ చేశారు. ‘గ్రావిటీ ఏజింగ్ హైపోథసిస్’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. గ్రావిటీ వల్ల గుండె రక్తాన్ని మెదడుకు పంప్ చేయడం కష్టమవుతుందని, దీనివల్ల వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు తగ్గుతుందని గోయల్ నమ్ముతున్నారు.
ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు, కేవలం ప్రయోగ దశలోనే ఉంది. ఇది జోమాటో ప్రాడక్ట్ కాదు, ‘కంటిన్యూ రీసెర్చ్’ అనే హెల్త్ టెక్ స్టార్టప్ కింద దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికోసం గోయల్ ఇప్పటికే దాదాపు 25 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 208 కోట్లు సొంత డబ్బును పెట్టుబడి పెట్టారని సమాచారం.
అయితే వైద్య నిపుణులు మాత్రం దీని పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల మీద పెట్టుకునే చిన్న క్లిప్ ద్వారా మెదడు లోపలి రక్త ప్రవాహాన్ని ఖచ్చితంగా కొలవలేమని ముంబైకి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ విశ్వనాథన్ అయ్యర్ అంటున్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా మాత్రమే అది సాధ్యమని, ఇలాంటివి కేవలం వెల్నెస్ ప్రయోగాలే తప్ప మెడికల్ పరికరాలు కావని ఆయన స్పష్టం చేశారు.
గ్రావిటీ వల్ల మెదడు వయసు పెరుగుతుందన్న సిద్ధాంతాన్ని కూడా డాక్టర్లు కొట్టిపారేస్తున్నారు. గ్రావిటీ లేని అంతరిక్షంలో ఉండే ఆస్ట్రోనాట్స్ కు కూడా వయసు పెరుగుతుందని న్యూరాలజిస్ట్ మధుకర్ భరద్వాజ్ లాజిక్ చెప్పారు. ఎయిమ్స్ డాక్టర్ దత్తా అయితే దీన్ని “బిలియనీర్లు ఆడుకునే ఖరీదైన బొమ్మ”గా అభివర్ణించారు. ప్రస్తుతానికి దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు.
This post was last modified on January 5, 2026 9:44 pm
ఈ మధ్య స్టార్ హీరోల పారితోషకాలు బాగా పెంచేయడం.. అందుకు తగ్గట్లే సినిమాల బడ్జెట్లు పెరిగిపోవడం.. తీరా చూస్తే బిజినెస్, కలెక్షన్లు అనుకున్నంత…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎంతో ఎగ్జైట్ అవుతుంది. స్టార్ హీరోయిన్లు అయినా…
ఏటా జనవరి వస్తోంది.. పోతుంది... సంవత్సరాలు మారుతూ క్యాలెండర్ మారుతున్నాయి అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల గుర్తు చేస్తున్నారు. ఇది…
తెలంగాణ శాసన మండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఈ సీజన్లో మొత్తం 5 రోజుల పాటు మాత్రమే ఈ సమావేశాలు…
టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్…
నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారులను, పోలీసులను కూడా బెదిరించిన విషయం తెలిసిందే. తాట…