సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో సామాన్యులనే కాదు, చదువుకున్నవారినీ నిలువునా ముంచేస్తున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనే కొత్త పద్ధతితో ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక రిటైర్డ్ బ్యాంకు అధికారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.1.23 కోట్లను దోచుకున్నారు. రిటైర్డ్ బ్యాంకర్‌కు పది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వీడియో కాల్ వచ్చింది. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులమని పరిచయం చేసుకున్న వారు, ఆధార్ కార్డు ద్వారా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని, తైవాన్‌కు డ్రగ్స్ పార్సెల్స్ పంపిన కేసులో ఆయన పేరు ఉందని బెదిరించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ భయాందోళనలకు గురిచేశారు.
నిజమైన అధికారుల్లా మాట్లాడిన నేరగాళ్లు, బాధితుడిని ఇంట్లోని ఒక గదిలోనే ఉండాలని, ఎవరికీ సమాచారం ఇవ్వకూడదని ఆదేశిస్తూ ‘డిజిటల్ అరెస్ట్’ చేశారు. స్కైప్ ద్వారా 24 గంటల పాటు వీడియో పర్యవేక్షణలో ఉంచారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, షేర్లు, ఆస్తుల వివరాలను బెదిరింపుల ద్వారా తెలుసుకున్నారు. వీడియో కాల్‌లోనే ఇంటి తనిఖీ చేస్తున్నట్లు నటించి, బీరువాలో ఉన్న షేర్ మార్కెట్ పత్రాలను కూడా చూపించమన్నారు. భయంతో ఉన్న బాధితుడు, తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొదుపు మొత్తాన్ని మూడు విడతలుగా నేరగాళ్లు సూచించిన ఖాతాలకు మొత్తం రూ.1.23 కోట్లు బదిలీ చేశారు. అనంతరం నేరగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, సీఐ దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపారు, ‘డిజిటల్ అరెస్ట్’ అనే చట్టపరమైన విధానం దేశంలో ఎక్కడా లేదని, పోలీసులు, సీబీఐ, ఈడీ అధికారులు ఎప్పుడూ వీడియో కాల్‌ల ద్వారా బెదిరింపులు చేయరని స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేసి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, 1930కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.
This post was last modified on January 2, 2026 10:50 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఇండియాలో వివిధ భాషల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపులర్ ఏది అంటే బాలీవుడ్ దర్శక నిర్మాత…