Trends

హెల్మెట్‌పై పాలస్తీనా జెండా.. కశ్మీర్ క్రికెటర్‌పై కేసు నమోదు!

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్ మీద పాలస్తీనా జెండా స్టిక్కర్ పెట్టుకొని బ్యాటింగ్ కు రావడం కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ‘జమ్మూ కాశ్మీర్ 11’ (JK11) – ‘జమ్మూ ట్రైల్ బ్లేజర్స్’ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫర్హాన్ భట్ అనే ఆ ఆటగాడు పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ధరించి ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని భావించి, పోలీసులు వెంటనే ఆ క్రికెటర్ కు నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 173(3) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు అతను ఆ జెండా ఎందుకు పెట్టుకున్నాడు? అతని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కేవలం ఆ ప్లేయర్ నే కాకుండా, ఈ టోర్నమెంట్ నిర్వాహకుడు జాహిద్ భట్ ను కూడా పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ లీగ్ నిర్వహించడానికి సరైన అనుమతులు ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ వివాదంపై జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) వెంటనే స్పందించింది.

ఈ లీగ్ కు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ ఆటగాడు తమ అసోసియేషన్ కు చెందిన వ్యక్తి కాదని స్పష్టం చేసింది. అనవసరంగా తమ పేరును ఇందులో లాగొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

This post was last modified on January 2, 2026 5:33 pm

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

4 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

5 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

6 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

6 hours ago