Trends

న్యూ ఇయర్ ఆఫర్: మందుబాబుల‌కు ఉచిత ప్ర‌యాణం!

నూత‌న సంవ‌త్స‌రం 2026కు స్వాగ‌తం ప‌లుకుతూ.. 2025కు వీడ్కోలు చెబుతూ.. నిర్వ‌హించుకునే కార్యక్ర‌మాల్లో మందు బాబులు రెచ్చిపోవ‌డం ఖాయం. ముఖ్యంగా హైద‌రాబాద్ వంటి మెట్రో న‌గ‌రాల్లో మందు పార్టీల‌కు నూతన సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పెట్టింది పేరు. దీంతో అనేక బార్లు, రెస్టారెంట్లు.. ఇప్ప‌టికే మందుబాబుల‌కు ఫుల్ బాటిళ్ల‌పై రాయితీలు కూడా ప్ర‌క‌టించాయి. అయితే.. నాణేనికి ఇది ఒక‌వైపే.

మ‌రోవైపు.. మందు తాగి చిందులు వేస్తే ఊరుకునేది లేదని.. బుధ‌వారం పొద్దు పొద్దున్నే హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మందుబాబుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. రాత్రి 11-1 మ‌ధ్య న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్ర‌త్యేక త‌నిఖీలు ఉంటాయ‌ని చెప్పారు. మందు తాగి వాహ‌నం న‌డిపితే.. భారీ జ‌రిమానాలు విధించ‌డంతో పాటు.. స‌ద‌రు వాహ‌నాల‌ను కూడా జ‌ప్తు చేస్తామ‌న్నారు. అంతేకాదు.. జైలుకు కూడా పంపిస్తామ‌ని హెచ్చరించారు. ఈ ప్ర‌క‌ట‌న న‌గ‌రంలో తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

ఈ నేప‌థ్యంలో హుటాహుటిన బార్ల య‌జ‌మానుల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బార్ల‌లో మందు తాగిన వారిని ఇంటికి ఉచితంగా చేర్చేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని .. ప్ర‌త్యేకంగా కార్లు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం. అయితే..ఈ కార్లు ఎంపిక చేసిన ప్రాంతాల మీదుగానే న‌డ‌వ‌నున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఆయా దారుల్లో మందుబాబులు ప్ర‌యాణించేందుకు వెసులు బాటు క‌ల‌గ‌నుంది.

మ‌రోవైపు.. తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్ కూడా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మందు తాగిన వారు.. త‌మ‌కు ఫోన్ చేస్తే(నెంబ‌రు 8977009804) వారిని సుర‌క్షితంగా ఇళ్ల వ‌ద్ద‌కు తీసుకువెళ్తామ‌ని పేర్కొంది. దీనికి రూపాయి కూడా చార్జ్ చేయ‌బోమ‌ని వెల్ల‌డించింది. అయితే.. ఈ సేవ‌లు కేవ‌లం రాత్రి 11 నుంచి 1గంట మ‌ధ్య మాత్ర‌మే ఉంటాయ‌ని పేర్కొంది. క్యాబ్‌లు, ఆటోలు, ఈవీ బైక్‌లు కలిపి మొత్తం 500 వాహనాలు మందుబాబుల‌కు సేవ‌లు అందించ‌నున్నాయి. అయితే.. వీరి ప్ర‌క‌ట‌న వెనుక బార్ల యాజ‌మాన్యాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on December 31, 2025 2:57 pm

Share
Show comments
Published by
Kumar
Tags: New Year

Recent Posts

ఉత్తరాంధ్రకు న్యూ ఇయర్ గిఫ్ట్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్రకు నూతన గేమ్‌చేంజర్ కానుంది. విజయనగరం భోగాపురంలో నిర్మాణమైన అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026…

6 minutes ago

చెన్నైలో నాన్ లోకల్ పరిస్థితి ఇదా?

లోకల్ వెర్సస్ నాన్ లోకల్ గొడవలు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు తమ ఉపాధిని దెబ్బ…

52 minutes ago

2025: ఏపీకి పెట్టుబ‌డుల సంవత్సరమే.. !

సాధార‌ణంగా.. ఏ రాష్ట్రానికైనా పెట్టుబ‌డులు వ‌స్తాయి. కానీ.. ఏపీ విష‌యాన్ని గ‌మ‌నిస్తే.. 2025లో మెజారిటీ పార్ట్ అంతా కూడా.. పెట్టుబ‌డుల…

1 hour ago

‘ప‌వ‌న్‌ను రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నారు’

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వన్ క‌ల్యాణ్‌ను రెచ్చ‌గొట్టాల‌ని కొన్ని శ‌క్తులు చూస్తున్నాయ‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌,…

1 hour ago

క్రేజీ కాంబో 45కి సౌండ్ లేదేంటి

శివరాజ్ కుమార్ కన్నడలో సీనియర్ స్టార్ హీరో అయినప్పటికీ మనకు ఎక్కువ కనెక్ట్ కావడం మొదలయ్యింది జైలర్ తర్వాతే. రామ్…

2 hours ago

బాబులేరు… బాధ్య‌త తెలుసుకున్నారు!

ఏపీలో జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం ఒక రోజు ముందుగానే అమ‌లు చేసింది.…

3 hours ago