Trends

అమెరికా వీసా లాటరీపై బాంబు వేసిన ట్రంప్ సర్కార్

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇది నిజంగా పెద్ద షాకింగ్ న్యూస్. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్ 1బి వీసా ‘లాటరీ విధానానికి’ ట్రంప్ ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై అదృష్టం ఉంటే వీసా వస్తుంది అనుకోవడం కుదరదు. దీని స్థానంలో అత్యధిక నైపుణ్యం, ఎక్కువ జీతం ఉన్నవారికే రెడ్ కార్పెట్ పరిచే కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

ఇన్నాళ్లు ఉన్న లాటరీ సిస్టమ్ వల్ల తక్కువ జీతానికి పని చేసే విదేశీయులను కంపెనీలు రప్పించుకుంటున్నాయని, దీనివల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అందుకే ఈ పాత పద్ధతిని రద్దు చేసి, కేవలం ‘హై పెయిడ్’, ‘హై స్కిల్డ్’ వర్కర్లకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. అమెరికన్ వర్కర్ల వేతనాలు, పని పరిస్థితులను కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఇది మాత్రమే కాదు, వీసా సంపాదించడం అనేది ఇకపై చాలా ఖరీదైన వ్యవహారం కాబోతోంది. కొత్త హెచ్ 1బి అప్లికేషన్లకు ఏటా ఏకంగా 100,000 డాలర్ల ఫీజు కట్టాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ జడ్జి కూడా సమర్థించారు. ఇది అమెజాన్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీల నియామకాలపై భారీ ప్రభావం చూపనుంది.

ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. అంటే రాబోయే సీజన్ నుంచి ఈ రూల్స్ వర్తిస్తాయి. ఇకపై వీసా రావాలంటే ‘వెయిటెడ్ సెలెక్షన్ ప్రాసెస్’ ఉంటుంది. అంటే మీ జీతం ఎంత ఎక్కువ ఉంటే, వీసా వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ అన్నమాట.

మొత్తానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీసా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఒకపక్క 1 మిలియన్ డాలర్లతో ‘గోల్డ్ కార్డ్’ ఇస్తూ సంపన్నులకు పౌరసత్వానికి దారి చూపిస్తోంది. మరోపక్క సాధారణ ఉద్యోగులకు లాటరీని రద్దు చేసి కఠిన ఆంక్షలు పెడుతోంది. అమెరికా కల సాకారం చేసుకోవాలంటే ఇకపై టాలెంట్ తో పాటు ఆఫర్ లెటర్ లో భారీ ప్యాకేజీ ఉండాల్సిందే.

This post was last modified on December 24, 2025 12:28 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సంక్రాంతి హిట్… ఇంతలోనే

ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…

39 minutes ago

ఏప్రిల్… బాబుకి బలమైన సెంటిమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…

1 hour ago

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఏదో ఆశిస్తే..

గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…

2 hours ago

జనసేనకు అన్యాయం జరుగుతోందన్న బొలిశెట్టి

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…

3 hours ago

‘కన్నె పెట్టపై’ సంగీత దర్శకుడు ఫైర్

తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…

4 hours ago

నేషనల్ అవార్డులకు ఇవి కౌంటరా?

జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…

5 hours ago