Movie News

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద ప్రమాదంగా మారుతుంది. సుహాస్ కిది అనుభవమయ్యింది. ఒకటి హిట్టు కొట్టిందని ఆనందపడేలోగా వరసగా ఓ మూడు ఫ్లాపులు వచ్చేసి తన మార్కెట్ ని బాగా డ్యామేజ్ చేశాయి.

ఈ మధ్య ఓపెనింగ్స్ తేవడం మరీ కష్టమైపోయింది. ఓ భామ అయ్యో రామాకు ఈ పరిస్థితి తలెత్తింది. తమిళంలో మందాడితో విలన్ గా ఎంట్రీ ఇస్తున్న సుహాస్ కొత్త మూవీ హే బలవంత్ రేపు థియేటర్లలో అడుగు పెట్టనుంది. కంటెంట్ మీద నమ్మకంతో ఇవాళ రాత్రే మెయిన్ సెంటర్స్ లో ప్రీమియర్లు వేస్తున్నారు.

రేపు పోటీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది కానీ ప్రమోషన్ల వల్ల కాస్త ఎక్కువ దృష్టి హే బలవంత్ మీద ఉందన్నది వాస్తవం. కాకపోతే బంగారం లాంటి ఈ ఛాన్స్ ని ఎలా వాడుకుంటాడో చూడాలి. అసలే ఫ్యామిలీ బిజినెస్ అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీలో తెగ ఊదరగొట్టారు.

టాక్ లో ఇదే కీలకం కానుంది. కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఆ పాయింట్ ఉందా ఓకే. లేదంటే రిస్క్ అవుతుంది. పైగా తండ్రి కొడుకుల ఎమోషన్ బలంగా ఉందంటూ, నరేష్ పాత్ర ద్వారా మహేష్ బాబు అభిమానులు ఊగిపోయే ఎపిసోడ్స్ ఉన్నాయంటూ రకరకాల ఊరింపులు చేశారు. ఇవన్నీ తెరమీద వర్కౌట్ కావాలి.

గత వారం వచ్చిన ఫంకీ మూడు రోజులకే చేతులు ఎత్తేయగా మంచి టాక్ వచ్చినప్పటికీ కపుల్ ఫ్రెండ్లీ కొంచెం ఎదురీదుతోంది. సో హే భగవాన్ కనక ఈ గ్యాప్ ని సరిగ్గా వాడుకుంటే థియేటర్ బ్రేక్ ఈవెన్ ఈజీగా అందుకోవచ్చు. రెండు వారాలకు పైగా థియేటర్లు జనాలు లేక ఘొల్లుమంటున్నాయి.

సరైన ఫీడింగ్ లేక చాలా చోట్ల సెకండ్ షోలు వేయడమే మానేశారు. సంక్రాంతి హడావిడి అయిపోయిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి డల్లుగా మారిపోయింది. ఇప్పుడు జోష్ రావాలంటే హే బలవంత్ లాంటివి ఆడాలి. ఎలాగూ నెక్స్ట్ వీక్ శ్రీవిష్ణు తన విష్ణు విన్యాసంతో వస్తున్నాడు. అప్పటిదాకా ఎవరు నెట్టుకొస్తారో రేపీపాటికి తేలిపోతుంది.

This post was last modified on February 19, 2026 7:22 pm

Share

Recent Posts

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

19 minutes ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

23 minutes ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

1 hour ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

1 hour ago

జైలర్ 2 ఋజువు చేయాల్సినవి ఎన్నో

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…

2 hours ago

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

4 hours ago