ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ‘డ్యామేజ్ కంట్రోల్’ చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఎయిర్ పోర్టుల్లో నరకం చూసిన వారికి సారీ చెబుతూ, పది వేల రూపాయల ట్రావెల్ వోచర్లు ఇస్తామని ప్రకటించింది. కస్టమర్స్ కోపాన్ని ఈ కూపన్లతో తగ్గించే ఈ ప్రయత్నంపై సోషల్ మీడియాలో రకారకరాల కామెంట్స్ వెలువడుతున్నాయి.
ఈ ఆఫర్ ప్రకారం, బాగా ఇబ్బంది పడ్డ ప్యాసింజర్లు ఈ పది వేల వోచర్‌ను వచ్చే ఏడాదిలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇది టికెట్ రీఫండ్ కు అదనం అని సంస్థ చెబుతోంది. అయితే ఇక్కడో మెలిక ఉంది. ‘తీవ్రంగా ప్రభావితమైన’ వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. అంటే ఎవరు అర్హులు, ఎవరు కాదు అనేది ఇండిగోనే డిసైడ్ చేస్తుందన్నమాట. ఇది మరో పెద్ద కాంట్రవర్సి అయ్యే అవకాశం ఉంది.
అసలు ప్రశ్న ఏంటంటే.. ఈ పది వేలు నిజంగా సరిపోతుందా? ఆ ప్రయాణం నమ్ముకుని మిస్ అయిన పెళ్లిళ్లు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, పరీక్షల విలువను ఈ వోచర్లు భర్తీ చేయగలవా? అర్జంట్‌గా వేరే ఫ్లైట్‌లో వెళ్లడానికి జనం తడిసి మోపెడయ్యేలా ఖర్చు చేశారు. ఆ మానసిక వేదన ముందు ఈ వోచర్లు కేవలం కంటితుడుపు చర్యలాగే కనిపిస్తున్నాయి.
ఈ గందరగోళానికి అసలు కారణం కొత్త నిబంధనల (FDTL) ప్రకారం పైలట్లకు ఇవ్వాల్సిన విశ్రాంతి ఇవ్వకుండా, డిమాండ్ కు తగ్గ సిబ్బందిని నియమించుకోకుండా లాభాల కోసం కక్కుర్తి పడటమే ఈ సంక్షోభానికి అసలు కారణం అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ప్రయాణికుల సౌకర్యం కంటే తమ బిజినెస్ మార్జిన్లకే ఇండిగో పెద్దపీట వేసింది.
ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇండిగో వింటర్ షెడ్యూల్ లో 10 శాతం కోత విధించింది. ప్రయాణికుల సేఫ్టీ, టైం కంటే తమ బిజినెస్ ముఖ్యమని భావించిన ఇండిగోకు ఇది గట్టి ఎదురుదెబ్బే. జనం నమ్మకాన్ని మళ్ళీ గెలవాలంటే కూపన్లు పంచితే సరిపోదు, సర్వీస్ లో క్వాలిటీ మార్చాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
This post was last modified on December 11, 2025 5:10 pm
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…
పార్టీ మెప్పు కోసమో.. తమ ప్రాపకం కోసమో.. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు తెగ రెచ్చిపోతుంటారు. వేదిక దొరికితే చాలు…