Trends

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక గానీ అసలు నిజం తెలియదు. డబ్బులు వస్తాయి కానీ మనశ్శాంతి ఉండదని చాలామంది ఫీల్ అవుతుంటారు. సరిగ్గా ఇలాగే, కెనడాలో ఐదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఓ ఎన్నారై, అక్కడి యాంత్రిక జీవనానికి విసిగిపోయి జాబ్‌కి రిజైన్ చేసి ఇండియా వచ్చేస్తున్నాడు. “ఇక నా వల్ల కాదు, ఆ రోబో లైఫ్ భరించలేను” అంటూ సోషల్ మీడియాలో (Reddit) పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కెనడాలో జీవితం పైకి చూడటానికి బాగున్నా, లోపల మాత్రం చాలా “రోబోటిక్”గా ఉంటుందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ స్నేహితులు ఉన్నా కూడా, ఏదో తెలియని సోషల్ ఐసోలేషన్ వేధిస్తోందట. ప్రతి చిన్న పనికి ప్లానింగ్ అవసరమే. ఉదాహరణకు, బియ్యం కొనాలంటే కూడా కాస్ట్‌కోకి వెళ్లాలి, దానికి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. మన దగ్గరలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లే స్వేచ్ఛ లేకపోవడంతో తాను మనిషిలా ఫీల్ అవ్వలేకపోతున్నానని చెప్పాడు.

ఇండియాలో ఉండే “ఆర్గనైజ్డ్ ఖాయోస్” ను తాను బాగా మిస్ అవుతున్నట్లు రాసుకొచ్చాడు. మన దేశంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెండ్స్‌ని కలవచ్చు, సడెన్ ప్లాన్స్ వేసుకోవచ్చు. దీనివల్ల రోజంతా వృథా అవ్వదు. కానీ విదేశాల్లో ఆ పరిస్థితి లేదు. ఈ స్వేచ్ఛ లేని స్ట్రక్చర్డ్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే, జాబ్ మానేసి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిపాడు.

అంతేకాదు, అక్కడ డేటింగ్ లైఫ్ కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకొచ్చాడు. భయంకరమైన చలికాలంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతారని, కొత్తవాళ్లను కలవడం కష్టమని చెప్పాడు. ఇండియాలో దుమ్ము, ధూళి, సివిక్ సెన్స్ తక్కువని కొందరు విమర్శించినా పర్లేదు.. ఎన్ని లోపాలున్నా అది “మన ఇల్లు” అని ఎమోషనల్ అయ్యాడు.

ఇతని నిర్ణయం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవడంతో పాటు మద్దతు కూడా ఇస్తున్నారు. “నీ సంతోషం ఎక్కడుంటే అక్కడే ఉండు, ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకున్నావ్” అని అభినందిస్తున్నారు. డబ్బు కంటే మనశ్శాంతి, సొంత మనుషుల మధ్య ఉండటమే ముఖ్యమని ఈ ఎన్నారై స్టోరీ మరోసారి నిరూపించింది. “ఫాలో యువర్ హార్ట్” అనే కామెంట్స్ ఇప్పుడు ఈ పోస్ట్ కింద వెల్లువలా వస్తున్నాయి.

This post was last modified on December 5, 2025 2:39 pm

Share
Show comments
Published by
Kumar
Tags: NRI

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

1 hour ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago