కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక వింత సంఘటన జరిగింది. రిసెప్షన్ వేదిక రెడీ, బంధువులంతా వచ్చేశారు, విందు భోజనాలు సిద్ధం. కానీ స్టేజ్ మీద ఉండాల్సిన పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం లేరు. వాళ్లు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండి, వీడియో కాల్ ద్వారా తమ సొంత రిసెప్షన్‌కు హాజరయ్యారు. టెక్నాలజీ యుగంలో ‘వర్చువల్ రిసెప్షన్’ అంటే ఇదేనేమో అనిపించేలా జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ “డిజిటల్ తిప్పలకు” కారణం ఇండిగో విమానయాన సంస్థ. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మేధా, సంగమ దాస్ అనే జంటకు నవంబర్ 23న భువనేశ్వర్‌లో పెళ్లి జరిగింది. డిసెంబర్ 3న హుబ్బళ్లిలో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారు. కానీ, దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవుతుండటంతో వీళ్లు భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయారు. డిసెంబర్ 2న ఎక్కాల్సిన ఫ్లైట్, పదే పదే వాయిదా పడి చివరకు రద్దవడంతో వాళ్లకు దిక్కుతోచలేదు.
అప్పటికే బంధుమిత్రులంతా గుజరాత్ భవన్ ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. చివరి నిమిషంలో ఫంక్షన్ క్యాన్సిల్ చేయడం సాధ్యం కాదు. దీంతో వధువు తల్లిదండ్రులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వధూవరులు కూర్చోవాల్సిన కుర్చీల్లో వాళ్లే కూర్చుని పూజలు, రిసెప్షన్ తంతు నడిపించారు. అటు భువనేశ్వర్‌లో ఉన్న కొత్త జంట, పెళ్లి బట్టల్లో ముస్తాబై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్క్రీన్ మీద దర్శనమిచ్చారు. వచ్చిన అతిథులు ఆశీర్వాదాలు స్క్రీన్ వైపు చూసే అందించాల్సి వచ్చింది.
“మేము తెల్లవారుజామున 4 గంటల వరకు ఫ్లైట్ వస్తుందేమో అని ఆశగా ఎదురుచూశాం. కానీ సడెన్‌గా క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చింది. ఇంతమందిని పిలిచి వెనక్కి పంపలేక, ఫ్యామిలీ అంతా చర్చించుకుని ఇలా ఆన్‌లైన్ పద్ధతిని ఎంచుకున్నాం” అని వధువు తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వధూవరులే కాదు, ముంబై మీదుగా రావాల్సిన చాలామంది బంధువులు కూడా ఫ్లైట్స్ లేక ఈ వేడుకకు రాలేకపోయారు.
నిజానికి ఇది ఒక్క జంట సమస్య కాదు. కొత్త డీజీసీఏ నిబంధనల వల్ల పైలట్ల రోస్టర్ ప్లానింగ్ దెబ్బతిని, ఇండిగో సంస్థ దేశవ్యాప్తంగా వందల విమానాలను రద్దు చేస్తోంది. గురువారం ఒక్కరోజే 500కు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్స్ మళ్లీ గాడిన పడటానికి ఫిబ్రవరి వరకు సమయం పడుతుందని ఇండిగో చెబుతోంది. అప్పటివరకు ప్రయాణికులకు ఇలాంటి తిప్పలు తప్పేలా లేవు.
This post was last modified on December 5, 2025 2:00 pm
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…