అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే కాదు, మీ సోషల్ మీడియా అకౌంట్లు కూడా ‘శుభ్రం’ చేసుకోవాలి. ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్ 15 నుంచి కొత్త రూల్ తెస్తోంది. దీని ప్రకారం మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ‘పబ్లిక్’లో ఉండాలి. వీసా ఆఫీసర్లు మీ పోస్టులు, లైకులు, కామెంట్లను జల్లెడ పడతారు. ఇందులో ఏ చిన్న తేడా ఉన్నా వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అసలు వాళ్లు ఏం వెతుకుతారు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మీరు అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా పోస్ట్ చేశారా? ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేలా ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? లేదా ఏదైనా విద్వేషపూరిత కంటెంట్‌ను షేర్ చేశారా? అనేవి ప్రధానంగా చూస్తారు. మీరు సరదాకి చేసిన మీమ్స్, ఎమోషనల్‌గా పెట్టిన పొలిటికల్ పోస్టులు కూడా ఇప్పుడు మీ కొంప ముంచొచ్చు. అందుకే, పాత పోస్టులను ఒక్కసారి రివ్యూ చేసుకోవడం చాలా ముఖ్యం.
కేవలం మీ పోస్టులే కాదు, మీరు ఫాలో అయ్యే పేజీలు, వ్యక్తులు కూడా కౌంట్ అవుతారు. మీరు ఏదైనా రాడికల్ గ్రూప్‌ని ఫాలో అవుతుంటే అది మీ ప్రొఫైల్‌పై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. మన విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పినట్లు, చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా చూడొద్దని భారత్ కోరినా, అంతిమ నిర్ణయం అమెరికాదే. “వీసా అనేది హక్కు కాదు, అది వాళ్లు ఇచ్చే అవకాశం” అని గుర్తుంచుకోవాలి.
టెక్ నిపుణులు చెబుతున్న సలహా ఏంటంటే.. వీసా ప్రాసెస్ అయ్యేంత వరకు సోషల్ మీడియాలో వివాదాస్పద చర్చలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే, గతంలో పెట్టిన అనవసరమైన పోస్టులను డిలీట్ చేయడం సేఫ్. మీ డిజిటల్ ప్రవర్తన కూడా ఇప్పుడు మీ క్యారెక్టర్ సర్టిఫికెట్ లాంటిదే. కాబట్టి, వీసా కోసం రెడీ అవుతున్న టెక్కీలు.. పాస్‌పోర్ట్‌తో పాటు పాస్‌వర్డ్స్ (అకౌంట్స్) కూడా రెడీగా ఉంచుకోండి. మీ ఆన్‌లైన్ హిస్టరీ క్లీన్‌గా ఉంటేనే అమెరికా ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ దక్కుతుంది. లేదంటే, ఒక చిన్న లైక్ లేదా షేర్ మీ అమెరికా కలను విచ్ఛిన్నం చేయొచ్చు.
This post was last modified on December 5, 2025 12:54 pm
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
వైసీపీ వాళ్లు ఇక మూడు రాజధానుల మాటెత్తరేమో..? తమ కొంప ముంచిన ఆ విధానంపై ఇక మాట్లాడరేమో..? ఆ పేరు…