Trends

ఇక రిటైర్మెంట్ మాటెత్తకండి… ఇది కింగ్ కోహ్లీ 2.0

రాయ్‌పూర్ వేదికగా మరోసారి విరాట్ కోహ్లీ బ్యాట్ గర్జించింది. “కోహ్లీ పని అయిపోయింది, వయసు మీద పడింది” అని విమర్శించే వారికి తన బ్యాట్‌తోనే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇది విరాట్‌కి రెండో సెంచరీ. కేవలం 93 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 102 పరుగులు చేసి, తానింకా రేసుగుర్రాన్నే అని ప్రపంచానికి చాటిచెప్పాడు.

టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పాక, కోహ్లీ వన్డేల నుంచి కూడా తప్పుకుంటాడేమో అనే అనుమానాలు చాలామందిలో ఉండేవి. 2027 వరల్డ్ కప్ వరకు అతను ఫిట్‌గా ఉంటాడా? ఫామ్ కొనసాగిస్తాడా? అనే చర్చలు నడిచాయి. కానీ, ఈ సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేశాడు. ఫిట్‌నెస్, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్, షాట్ సెలక్షన్ చూస్తుంటే.. మరో మూడేళ్లు కాదు, ఐదేళ్లయినా ఆడగల సత్తా తనలో ఉందని నిరూపించాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీకి తోడుగా యంగ్ గన్ రుతురాజ్ గైక్వాడ్ (105 పరుగులు) కూడా చెలరేగిపోయాడు. వీరిద్దరూ కలిసి సఫారీ బౌలర్లను ఉతికారేశారు. ముఖ్యంగా సీనియర్, జూనియర్ కలిసి భారీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పడం మ్యాచ్‌కే హైలైట్. గైక్వాడ్ దూకుడుగా ఆడుతుంటే, కోహ్లీ తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతం.

ఈ సెంచరీతో కోహ్లీ సచిన్ 100 సెంచరీల రికార్డుకు మరింత చేరువయ్యాడు. కేవలం వన్డేలే ఆడుతున్నా, ఇలా ప్రతి మ్యాచ్‌లో సెంచరీలు కొడితే ఆ మ్యాజికల్ ఫిగర్ చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. కోహ్లీలో ఉన్న కసి చూస్తుంటే, రికార్డుల కోసం కాకపోయినా, టీమిండియాను గెలిపించడమే లక్ష్యంగా ఆడుతున్నట్లు అర్థమవుతోంది.

మొత్తానికి ఈ సిరీస్ కోహ్లీకి ఒక పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్. విమర్శకులు తన కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలని చూసిన ప్రతిసారీ, కామాలు పెట్టి ముందుకు వెళ్లడం కింగ్ కోహ్లీ స్టైల్. ఈ ఫామ్ చూస్తుంటే 2027 వరల్డ్ కప్‌లోనూ టీమిండియాకు ఆయనే ప్రధాన అస్త్రం కాబోతున్నాడని, కప్పు కొట్టేదాకా తగ్గేదేలే అని స్పష్టంగా సంకేతాలు పంపాడు.

This post was last modified on December 3, 2025 5:33 pm

Share
Show comments
Published by
Kumar
Tags: KohliRuturaj

Recent Posts

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

2 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

3 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

3 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

7 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

10 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

11 hours ago