ఈరోజు డిసెంబర్ 1, వరల్డ్ ఎయిడ్స్ డే. సాధారణంగా “హెచ్‌ఐవీ (HIV) వస్తే జీవితం అయిపోయినట్లే, దానికి మందు లేదు” అని చాలామంది బలంగా నమ్ముతారు. కానీ, వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం జరిగిందని, ఒక వ్యక్తి హెచ్‌ఐవీని పూర్తిగా జయించాడని మీకు తెలుసా? అతని పేరే తిమోతి రే బ్రౌన్. ప్రపంచం అతన్ని “ది బెర్లిన్ పేషెంట్” అని పిలుస్తుంది.
తిమోతి కథ ఒక మెడికల్ మిరాకిల్. 1995లో అతనికి హెచ్‌ఐవీ సోకింది. మందులు వాడుతూ బతుకుతుండగా, 2006లో అతనికి మరో దెబ్బ తగిలింది. లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ చికిత్స కోసం అతనికి ‘స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్’ చేయాల్సి వచ్చింది. ఇక్కడే డాక్టర్లు ఒక వినూత్న ప్రయోగం చేశారు. హెచ్‌ఐవీని అడ్డుకునే అరుదైన జన్యువు ఉన్న వ్యక్తి నుంచి స్టెమ్ సెల్స్ తీసుకుని తిమోతికి ఎక్కించారు.
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. కానీ అసలు షాక్ తర్వాత తెలిసింది. తిమోతి శరీరం నుంచి క్యాన్సర్ మాత్రమే కాదు, హెచ్‌ఐవీ వైరస్ కూడా పూర్తిగా మాయమైపోయింది. అతను రెగ్యులర్‌గా వాడే మందులు మానేసినా వైరస్ మళ్లీ రాలేదు. 2008లో ఈ విషయం ప్రపంచానికి తెలియగానే మెడికల్ సైన్స్ ఆశ్చర్యపోయింది. “హెచ్‌ఐవీని నయం చేయడం సాధ్యమే” అని తిమోతి నిరూపించాడు.
దురదృష్టవశాత్తూ, తిమోతి రే బ్రౌన్ 2020లో ఆయన కన్నుమూశారు. కానీ అతను చనిపోయింది ఎయిడ్స్ వల్ల కాదు. అంతకుముందు ఉన్న బ్లడ్ క్యాన్సర్ లుకేమియా మళ్లీ రావడంతో చనిపోయారు. చనిపోయేంత వరకు ఆయన శరీరంలో హెచ్‌ఐవీ వైరస్ జాడ లేదు. అంటే ఆయన ఎయిడ్స్‌ను పూర్తిగా జయించి, చరిత్రలో నిలిచిపోయారు. తిమోతికి చేసిన చికిత్స అందరికీ సాధ్యం కాకపోవచ్చు, అది చాలా ఖరీదైనది, రిస్క్‌తో కూడుకున్నది కూడా. కానీ, అతను ఇచ్చిన స్ఫూర్తితో శాస్త్రవేత్తలు కొత్త దారుల్లో పరిశోధనలు చేస్తున్నారు.
This post was last modified on December 1, 2025 7:12 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…