బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ ఆ ఇష్టమే కొందరికి పిచ్చిగా మారుతుంది. ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారం వేసుకుని తిరిగితే చూసేవాళ్లకు ముచ్చటగా ఉండొచ్చు కానీ, దొంగలకు, గ్యాంగ్‌స్టర్లకు మాత్రం అది ఒక టార్గెట్‌లా కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి ఒక ‘గోల్డ్ మ్యాన్’ ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. తన మెడలోని బంగారమే తన మెడకు చుట్టుకునేలా మారింది.
రాజస్థాన్ లోని చిత్తోర్‌గఢ్ లో ఇతను చాలా ఫేమస్. ఎందుకంటే ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి లాగా ఎప్పుడూ భారీగా నగలు వేసుకుని కనిపిస్తాడు. స్థానికులు ఆయన్ను ‘చిత్తోర్‌గఢ్ బప్పీ లహరి’ అని పిలుచుకుంటారు. అయితే రెండు రోజుల క్రితం వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్, ఆడియో మెసేజ్ అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అడిగినంత ఇవ్వకపోతే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరికలు వచ్చాయి.
అసలు వివరాల్లోకి వెళ్తే.. ఇతని పేరు కన్హయ్యలాల్ ఖటిక్. పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. తాజాగా ఇతనికి అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మొదట మిస్డ్ కాల్స్, ఆ తర్వాత వాట్సాప్ కాల్స్ వచ్చాయి. లిఫ్ట్ చేయకపోవడంతో ఒక ఆడియో రికార్డింగ్ పంపించారు. అందులో ఏకంగా 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆ ఆడియో మెసేజ్ లో ఉన్న కంటెంట్ వింటే షాక్ అవ్వాల్సిందే. “డబ్బులు ఇవ్వకపోతే.. నువ్వు ఇకపై బంగారం వేసుకునే స్థితిలో ఉండవు” అంటూ గ్యాంగ్‌స్టర్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా సైలెంట్ గా సెటిల్ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో భయపడిపోయిన కన్హయ్యలాల్ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఒకప్పుడు తోపుడు బండిపై కూరగాయలు అమ్మిన కన్హయ్యలాల్, ఆ తర్వాత పండ్ల వ్యాపారంలో స్థిరపడి సంపన్నుడయ్యాడు. బప్పీ లహరి ఇన్‌స్పిరేషన్ తో దాదాపు 3.5 కిలోల బంగారాన్ని ఒంటిపై ధరించి ‘గోల్డ్ మ్యాన్’ గా మారాడు. ఇక బెదిరించిన రోహిత్ గోదారా సామాన్యుడు కాదు. సిద్దు మూసేవాలా హత్య కేసులో ఇతను కూడా ఒక నిందితుడు. కెనడాలో తలదాచుకుని ఇలాంటి దందాలు నడిపిస్తున్నాడు. పోలీసులు గోదారా గ్యాంగ్ లింకులపై ఆరా తీస్తున్నారు. 5 కోట్ల డిమాండ్ అనేది చిన్న విషయం కాదు కాబట్టి, అధికారులు దీనిని సీరియస్ గా తీసుకున్నారు.
This post was last modified on November 29, 2025 10:50 am
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…