ఒక సామాన్య ర్యాపిడో బైక్ డ్రైవర్.. రోజువారీ బతుకు బండి లాగడమే కష్టం. కానీ అతని బ్యాంక్ అకౌంట్లో మాత్రం కోటానుకోట్ల లావాదేవీలు జరిగాయి. అక్షరాలా రూ. 331 కోట్లు వచ్చి పడ్డాయి. ఈ విషయం బయటపడటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో ఆరా తీస్తే, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌కు లింక్ దొరికింది.
ఈ డబ్బంతా గుజరాత్‌కు చెందిన యువ రాజకీయ నాయకుడు ఆదిత్య జులాకు సంబంధించిన పెళ్లి ఖర్చుల కోసం వాడారని తేలింది. ఉదయ్‌పూర్‌లోని కాస్ట్లీ ‘తాజ్ ఆరావళి రిసార్ట్’లో గత ఏడాది నవంబర్‌లో ఈ పెళ్లి జరిగింది. డ్రైవర్ అకౌంట్ నుంచి ఏకంగా కోటి రూపాయలకు పైగా ఈ పెళ్లి కోసం ఖర్చు చేశారు. విచిత్రం ఏంటంటే.. ఆ ర్యాపిడో డ్రైవర్‌కు, పెళ్లి చేసుకున్న వధూవరులకు కనీసం పరిచయం కూడా లేదు. మరి అతని అకౌంట్ ఎలా వాడారనేదే ఇక్కడ అసలు ట్విస్ట్.
ఈడి దర్యాప్తులో అసలు గుట్టు బయటపడింది. ఇదంతా ‘1xBet’ అనే అక్రమ బెట్టింగ్ రాకెట్ దందా అని తేలింది. ఆగస్టు 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్యలో ఈ డ్రైవర్ అకౌంట్‌లోకి ఏకంగా రూ. 331.36 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇదొక ‘మ్యూల్ అకౌంట్’ (Mule Account). అంటే, అసలు నేరస్థులు తమ మొహాలు బయటపడకుండా, అమాయకుల అకౌంట్లను అద్దెకు తీసుకుని, బ్లాక్ మనీని తరలించడానికి వాడే పద్ధతి ఇది.
దొంగతనం చేసిన డబ్బును నేరుగా వాడితే దొరికిపోతామని, ఇలా ఏ పాపం తెలియని డ్రైవర్ అకౌంట్‌ను అడ్డాగా మార్చుకున్నారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా ఉండటానికే ఈ థర్డ్ పార్టీ అకౌంట్ స్కెచ్ వేశారు. వచ్చిన డబ్బును వచ్చినట్టే వెంటనే వేరే అకౌంట్లకు బదిలీ చేశారు. కేవలం కొద్ది మొత్తానికి ఆశపడి తన అకౌంట్ యాక్సెస్ ఇచ్చినందుకు, ఆ సామాన్య డ్రైవర్ ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు.
ఈ ఘటనతో ఈడి అధికారులు ప్రజలకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. కమిషన్ ఇస్తాం కదా అని, లేదా తెలిసినవాళ్లే కదా అని ఎవరికి పడితే వాళ్లకు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీలు, చెక్ బుక్కులు ఇవ్వొద్దని హెచ్చరిస్తున్నారు. మీకు తెలియకుండానే మీ అకౌంట్ ఇలాంటి పెద్ద స్కాముల కోసం వాడే ప్రమాదం ఉంది.
This post was last modified on November 29, 2025 8:24 am
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…