Trends

మోస్ట్ పవర్ఫుల్ లేజర్ గన్.. సెకనులో ఖతం

స్టార్ వార్స్ లాంటి సినిమాల్లో లేజర్ గన్నులను అందరూ చూసే ఉంటారు, అందులోంచి ఒక లైట్ వస్తుంది, అవతలి వాళ్ల విమానాలు పేలిపోతాయి. అది అప్పుడు గ్రాఫిక్స్, కానీ ఇప్పుడు నిజం. బ్రిటన్ సరిగ్గా అలాంటి ఆయుధాన్నే తయారు చేసింది. దీని పేరు ‘డ్రాగన్ ఫైర్’. ఇది తుపాకీ గుండులాగా శబ్దం చేయదు, కంటికి కనిపించదు. కానీ ఆకాశంలో ఎంత వేగంగా వెళ్తున్న డ్రోన్‌నైనా, బాంబునైనా క్షణాల్లో కాల్చి బూడిద చేస్తుంది.

దీని గురి ఎంత పర్ఫెక్ట్ అంటే.. ఒక కిలోమీటర్ దూరంలో మనం వాడే చిన్న 5 రూపాయల కాయిన్ నిలబెట్టినా, దాన్ని కచ్చితంగా కాల్చగలదట. మామూలుగా గాలిలో వేగంగా వెళ్లే వస్తువులను కొట్టడం చాలా కష్టం. కానీ ఈ లేజర్ సిస్టమ్ మాత్రం గురి అస్సలు తప్పదు. స్కాట్లాండ్‌లో చేసిన టెస్టుల్లో ఇది డ్రోన్లను గాల్లోనే ముక్కలు చేసింది.

అసలు ఈ వెపన్ ఎందుకు అంత స్పెషల్ అంటే.. దీనికయ్యే ఖర్చే కారణం. మామూలుగా శత్రువు పంపే క్షిపణిని కూల్చాలంటే, మనం కూడా ఒక క్షిపణిని వాడాలి. దాని ఖరీదు కొన్ని కోట్లలో ఉంటుంది. కానీ ఈ లేజర్ గన్ నుంచి ఒక్కసారి ఫైర్ చేయడానికి కేవలం 10 పౌండ్లు.. అంటే మన డబ్బుల్లో సుమారు 1000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. కోట్లు ఎక్కడ? వెయ్యి రూపాయలు ఎక్కడ? అందుకే ఇది గేమ్ ఛేంజర్.

ఇది ఎలా పనిచేస్తుందంటే.. కరెంట్ సాయంతో శక్తివంతమైన కాంతి కిరణాన్ని తయారు చేస్తుంది. టార్చ్ లైట్ వేసినంత ఈజీగా ఇది వెళ్తుంది. ఇది కాంతి వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి శత్రువు తప్పించుకునే ఛాన్స్ ఉండదు. ఆ లేజర్ కిరణం టార్గెట్ మీద పడగానే, విపరీతమైన వేడి పుట్టి ఆ వస్తువు అక్కడికక్కడే కాలిపోతుంది లేదా కరిగిపోతుంది. ఇందులో బుల్లెట్లు అయిపోతాయనే భయం కూడా ఉండదు. పవర్ ఉంటే చాలు, ఎంతమందినైనా కొట్టొచ్చు.

మరో ఐదేళ్లలో, అంటే 2027 నాటికి దీన్ని బ్రిటన్ నేవీ షిప్స్‌లో వాడబోతున్నారు. తక్కువ ఖర్చుతో దేశాన్ని కాపాడుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో ఇక బాంబుల మోత కంటే, ఇలాంటి సైలెంట్ లేజర్ దాడులే ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

This post was last modified on November 28, 2025 6:38 am

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago