సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే పిచ్చి, ఫాలోవర్లను పెంచుకోవాలనే తాపత్రయం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. రష్యాకు చెందిన 30 ఏళ్ల ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ దిమిత్రి నుయాంజిన్ విషయంలో అదే జరిగింది. తన క్లయింట్స్ కోసం ఒక వెరైటీ ఎక్స్‌పెరిమెంట్ చేయబోయి, అనూహ్యంగా నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. ఫిట్‌నెస్ కోచ్‌గా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన అతను, ఇప్పుడు అందరికీ ఒక హెచ్చరికలా మారిపోయాడు.
అసలు దిమిత్రి ప్లాన్ ఏంటంటే.. తానే స్వయంగా బరువు పెరిగి, ఆ తర్వాత మళ్లీ బరువు తగ్గి చూపించాలనుకున్నాడు. ఇలా చేస్తే తన స్టూడెంట్స్‌కి మోటివేషన్ వస్తుందని భావించాడు. దీనికోసం ఏకంగా 25 కిలోలు బరువు పెరగాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అది కూడా హెల్దీగా కాదు, కేవలం జంక్ ఫుడ్ మాత్రమే తిని లావు అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడే అతను పెద్ద తప్పు చేశాడు.
దీనికోసం అతను రోజుకు ఏకంగా 10,000 క్యాలరీల ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కేకులు, పేస్ట్రీలు.. మధ్యాహ్నం మయోన్నైజ్‌తో నిండిన ఫుడ్.. రాత్రికి పిజ్జాలు, బర్గర్లు.. ఇలా విపరీతంగా తినేవాడు. సాధారణ మనిషికి రోజుకు 2000 క్యాలరీలే ఎక్కువ అనుకుంటే, ఇతను ఐదు రెట్లు ఎక్కువ తిని బాడీని చెత్తబుట్టలా మార్చేశాడు. ఫలితంగా నెల రోజుల్లోనే 13 కిలోలు పెరిగి, 105 కిలోలకు చేరుకున్నాడు.
కానీ ఈ ప్రయోగం అతని గుండెపై పెను భారాన్ని మోపింది. చనిపోవడానికి ముందు రోజు తనకు ఒంట్లో బాగోలేదని, డాక్టర్‌ను కలుస్తానని ఫ్రెండ్స్‌కి చెప్పి ట్రైనింగ్ సెషన్స్ క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ, ఆ రాత్రి నిద్రపోయిన దిమిత్రి మళ్లీ లేవలేదు. నిద్రలోనే గుండెపోటు రావడంతో మరణించాడు. అతని చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో లేస్ చిప్స్ తింటూ కనిపించడం చూసి ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఫిట్‌నెస్ కోచ్, ఇలా ప్రమాదకరమైన ఛాలెంజ్‌లతో ప్రాణాలు కోల్పోవడం ఇంటర్నెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ఆన్‌లైన్ క్రేజ్ కోసం శరీరాన్ని ప్రయోగశాలగా మార్చుకుంటే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఘటన కళ్ళకు కట్టింది. సిద్ధాంతాలను నిరూపించడానికి ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on November 27, 2025 2:17 pm
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…