ఆస్కార్ విన్నర్, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నవంబర్ 27న హరిణ్య రెడ్డితో ఏడడుగులు వేయనున్నాడు. అయితే, పెళ్లికి ముందు జరిగిన సంగీత్ వేడుకలో ఒక క్రేజీ సీన్ జరిగింది. సాధారణంగా సినీ సంగీత్ అంటే హీరోలు, హీరోయిన్లు వస్తారని ఆశిస్తాం. కానీ రాహుల్ ఈవెంట్‌లో సడెన్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.
అసలు క్రికెటర్ చాహల్ ఈ సంగీత్‌కి ఎందుకు వచ్చాడు? అనే డౌట్ చాలా మందికి వచ్చింది. దీని వెనుక రాహుల్ సిప్లిగంజ్ ‘మాస్టర్ ప్లాన్’ ఉంది. తన కాబోయే భార్య హరిణ్య రెడ్డికి చాహల్ అంటే పిచ్చి అభిమానమట. ఆమెకు ఇష్టమైన క్రికెటర్‌ని నేరుగా సంగీత్ స్టేజ్ మీదకు తీసుకొచ్చి, ఆమెకు లైఫ్‌లో మర్చిపోలేని ‘బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్’ ఇచ్చాడు రాహుల్. సడెన్‌గా తన ఫేవరెట్ స్టార్‌ని పక్కన చూసి హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ విషయాన్ని హరిణ్యనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. “ఇంత పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చినందుకు థాంక్స్ రాహుల్.. నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన నా సంగీత్‌కి వచ్చారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ మూమెంట్ నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. బ్లాక్ సూట్‌లో చాహల్, కాబోయే వధూవరులతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.
రాహుల్, హరిణ్యల జర్నీ విషయానికి వస్తే, గత ఆగస్టులో వీరి నిశ్చితార్థం చాలా గ్రాండ్‌గా జరిగింది. హరిణ్య రెడ్డి సామాన్య కుటుంబం నుంచి రాలేదు. ఆమె నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె. ఇన్నాళ్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న మన ‘నాటు నాటు’ సింగర్, ఇప్పుడు ఒక ప్రముఖ పొలిటికల్ ఫ్యామిలీ అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు.
సంగీత్ వేడుకే ఇంత కలర్‌ఫుల్‌గా, సెలబ్రిటీలతో సందడిగా జరిగితే.. ఇక పెళ్లి ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. నవంబర్ 27న జరగబోయే ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు, రాజకీయ నాయకులు కూడా క్యూ కట్టబోతున్నారు. మొత్తానికి తన పాటలతో అందరినీ ఫిదా చేసే రాహుల్, ఇలాంటి సర్‌ప్రైజ్‌లతో రియల్ లైఫ్ లవర్‌గా కూడా ఫుల్ మార్కులు కొట్టేశాడు.
This post was last modified on November 25, 2025 1:07 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…