దుబాయ్ ఎయిర్ షోలో ఊహించని విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. భారత్ గర్వంగా ప్రదర్శించిన ‘తేజస్’ యుద్ధ విమానం విన్యాసాలు చేస్తూ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమన్ష్ స్యాల్ ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వేల అడుగుల ఎత్తులో సాహసోపేతమైన విన్యాసాలు చేస్తుండగా, క్షణాల్లోనే విమానం అదుపు తప్పి నేలకూలింది. దురదృష్టవశాత్తూ, పైలట్ ఎజెక్ట్ అయ్యే అవకాశం కూడా దక్కలేదు.
అసలు ఎవరీ నమాంశ్ స్యాల్?
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, పటియాల్కర్ గ్రామానికి చెందిన నమన్ష్ వయసు 34 ఏళ్లు. చిన్నప్పటి నుంచే దేశ సేవ చేయాలనే తపనతో సైనిక్ స్కూల్‌లో చదివారు. అంచెలంచెలుగా ఎదిగి వింగ్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం స్క్వాడ్రన్ లీడర్‌గా ఉన్న ఆయనకు త్వరలోనే ప్రమోషన్ కూడా రాబోతోందని బంధువులు చెబుతున్నారు. కానీ, అంతలోనే విధి చిన్నచూపు చూసింది.
నమాంశ్ కుటుంబం మొత్తం దేశ సేవకే అంకితమైంది. ఆయన భార్య కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఆఫీసరే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలో ఉన్నారు. వీరికి ఆరేళ్ల చిన్న పాప ఉంది. ఇక నమాంశ్ తండ్రి జగన్నాథ్ స్యాల్ కూడా గతంలో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు. కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం తమిళనాడులోని సూలూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నెగటివ్ జి మ్యాన్యువర్’ అనే అత్యంత క్లిష్టమైన విన్యాసం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. తక్కువ ఎత్తులో విమానాన్ని నియంత్రించలేకపోవడంతో, వేగంగా వచ్చి నేలను ఢీకొట్టింది. ఇంపాక్ట్ జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానం లెవల్‌గానే ఉన్నా, వర్టికల్ స్పీడ్ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాన్ని నివారించలేకపోయారు. దేశ రక్షణ కోసం, దేశ కీర్తిని పెంచడం కోసం ప్రాణాలర్పించిన ఈ వీర సైనికుడి మరణం పట్ల యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలుకుతోంది.
This post was last modified on November 22, 2025 11:57 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…