సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో దాదాపు 42 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది.
మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సులో ఉన్న యాత్రికులు నిద్రలో ఉండడంతో అంతా అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం.
మృతుల్లో 20 మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. బదర్ మదీనా మధ్య ముషారఫత్ ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
కొంత మంది తీవ్ర గాయాలతో మదీనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈ యాత్రికులు స్థానిక ట్రావెల్ ఏజెన్సీల ద్వారా ఏర్పాటు చేసిన ఉమ్రా ప్యాకేజీలో భాగంగా మక్కా వెళ్ళి మదీనాకు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. చాలామంది కుటుంబాలతో కలిసి వెళ్లారు. మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి
This post was last modified on November 17, 2025 10:29 am
కరిచే కుక్కలు లోపల ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నిన్న ఆమె…
రేపు రాత్రి అఖండ 2 తాండవం ప్రీమియర్లతో బాలయ్య షో ప్రారంభం కానుంది. ఓజి తర్వాత మళ్ళీ అంత పెద్ద…
శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…
హనుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ సజ్జా. ఐతే ఈ…
ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి…
ఏపీ సీఎం చంద్రబాబు తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలతో మమేకం అవుతుంటారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం పరదాలు…