ఆరేళ్ల న్యాయ పోరాటం, ఒక గ్లోబల్ విమానయాన దిగ్గజంతో యుద్ధం, చివరకు దిమ్మతిరిగే విజయం. ఇది 2019 విమాన ప్రమాదంలో చనిపోయిన శిఖా గార్గ్ కుటుంబం సాధించిన విజయం. బోయింగ్ 737 MAX విమాన డిజైన్ లోపం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆ కుటుంబం చేసిన పోరాటానికి, అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు రూ. 317 కోట్లు (35.85 మిలియన్ డాలర్లు) పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
అసలు ఎవరీ శిఖా గార్గ్?
2019, మార్చిలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం (బోయింగ్ 737 MAX) కూలిపోయిన ఘటనలో 150 మందికి పైగా చనిపోయారు. వారిలో శిఖా గార్గ్ ఒకరు. ఆమె ఐక్యరాజ్యసమితి (UN)లో కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. యూఎన్ ఎన్విరాన్‌మెంట్ అసెంబ్లీ మీటింగ్‌లో పాల్గొనడానికి నైరోబీ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. భారతీయ సంప్రదాయాలంటే ఎంతో ఇష్టపడే శిఖ, ఆ రోజు చీరకట్టులోనే విమానం ఎక్కారని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.
ఈ ప్రమాదానికి 5 నెలల ముందే ఇండోనేసియాలో మరో బోయింగ్ 737 MAX విమానం కూలిపోయింది. ఈ రెండు ప్రమాదాల్లో కలిపి 340 మంది మరణించారు. దీనికి కారణం విమానం మోడల్ డిజైన్‌లో ఉన్న తీవ్రమైన లోపమే. ఈ భయంకరమైన లోపం గురించి బోయింగ్ సంస్థ ప్రజలను హెచ్చరించడంలో విఫలమైందని శిఖ కుటుంబం ఆరోపించింది. చాలా మంది బాధితులు పరిహారం తీసుకుని సెటిల్ అయినా, శిఖ కుటుంబం మాత్రం బోయింగ్‌ను కోర్టుకీడ్చింది.
ఈ కేసులో ఆరేళ్లపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. విమాన తయారీ సంస్థ నిర్లక్ష్యం వల్లే అమాయకులు చనిపోయారని శిఖ కుటుంబం తరఫు న్యాయవాదులు బలంగా వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన షికాగో ఫెడరల్ జ్యూరీ, శిఖ కుటుంబానికి నష్టపరిహారంగా రూ. 317 కోట్లు చెల్లించాలని బోయింగ్‌ను ఆదేశించింది. ఈ రెండు వరుస ప్రమాదాల తర్వాతే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేగింది. అన్ని దేశాలూ బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కార్యకలాపాలను వెంటనే నిలిపివేశాయి. లోపాలను సరిదిద్దిన తర్వాత, దాదాపు 20 నెలల విరామం అనంతరం 2020 డిసెంబర్‌లో ఈ విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరడం మొదలుపెట్టాయి.
This post was last modified on November 17, 2025 10:26 am
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…