Trends

రెండు ‘యాప్‌’లు.. బోలెడు అద్భుతాలు!

తెలివి ఎవరి సొంతం కాదు అన్నట్టుగా మన వారిలోనూ మంచి మంచి ఆలోచనలు ఉండడంతో పాటు దేశాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఆలోచనలు చేయగల యువత ఉన్నారని మరోసారి నిరూపితం అవుతుంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు సృష్టించిన రెండు యాప్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచడంతోపాటు చర్చకు కూడా దారితీసాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం కీలకమైన ‘అర‌ట్టై’ యాప్‌ను ప్రమోట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించింది.

నిజానికి సుప్రీంకోర్టు ఎప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీచ‌ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా తమిళనాడు లోని యువకులు సృష్టించిన ‘అర‌ట్టై’ యాప్‌.. వాట్సాప్ ఫీచర్ల కన్నా ఎక్కువ ఫీచర్లను అందించడంతోపాటు వినియోగదారులకు సులభంగా చేరువైంది. ఈ నేపద్యంలో ఇది ఎక్కువమందికి ప్రయోజనకరంగా మారుతోంది అన్నది సర్వత్ర వినిపిస్తున్న మాట. అంతే కాదు వాట్సాప్ నుంచి త్వరలోనే ఇది రికార్డు సృష్టిస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.

వాట్సాప్ లో ఉన్న ఫ్యూచర్ లే ఇందులో కూడా ఉన్నాయి. ఫోటోలు, వీడియోలు, సందేశాలు, ఫోన్ కాల్స్ ఇలా అన్ని రకాలుగా ఇప్పుడు వేగంగా వినియోగదారులకు చేరువవుతోంది. ఈ యాప్ గురించి గత కొన్ని రోజులుగా చర‌చ్చ‌నడుస్తున్న క్రమంలో ఇప్పుడు తాజాగా మరో యాప్ వెలుగులోకి వచ్చింది. ఇది కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి సృష్టించారన్నది ఆసక్తిగా మారింది. కడలూరు జిల్లా చిదంబరం ప్రాంతానికి చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి రూపొందించిన ‘జారోజ్’ యాప్ ఇప్పుడు తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాసులను సైతం ముగ్ధులను చేస్తోంది.

ఈ యాప్ ద్వారా క్షణాల్లోనే ఆహార పదార్థాలను ఆర్డర్ పెట్టుకోవడం వాటిని తెప్పించుకునే సౌలభ్యం ఉంది. ఇప్పటివరకు జొమాటో, స్విగ్గి వంటి యాపుల ద్వారా ఉదయం టిఫిన్ నుంచి అర్ధరాత్రి తెల్లవారుజామున వరకు కూడా ఆహార డెలివరీలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా తమిళనాడుకు చెందిన రాంప్రసాద్ రూపొందించిన జారోజ్ యాప్ మరింత ఎక్కువగా వినియోగదారులకు చేరువవుతోంది.

దీనికి ప్రధాన కారణం జొమాటో, స్విగ్గిలు ఇటీవల జిఎస్టితో పాటు రుసుములు కూడా పెంచారు. ఇది హోటల్ యజమానులకు అదే విధంగా వినియోగదారులకు కూడా ఇబ్బందికరంగా మారింది. ధరలు పెంచితే వినియోదారులు దూరమవుతారని హోటల్ యజమానులు భావిస్తున్నారు. ధరలు పెంచకపోతే డెలివరీ కష్టమని స్విగ్గి జొమాటోలు స్పష్టం చేస్తున్నాయి. ఇది కొన్నాళ్లుగా వివాదంగా నడుస్తోంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన రాంప్రసాద్ సృష్టించిన జారోజ్ యాప్ తమిళనాడు వాసులకు చేరువైంది.

ప్రస్తుతం ఇది ఐదు జిల్లాలకు విస్తరించింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ యాప్ మరింత మందికి చేరువవ‌టం ఖాయంగా కనిపిస్తుంది. అటువైపు అర‌ట్టై మ‌రోవైపు జారోజ్ యాప్ లు కూడా స్వదేశీవి కావడం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం. ఏదేమైనా ఇప్పటివరకు విదేశాల కు చెందిన యాప్‌లపై ఆధారపడిన పరిస్థితుల నుంచి స్వదేశీ పరంగా యాప్‌లు రూపొందడం అవి చేరువ కావడం విశేషం.

This post was last modified on October 14, 2025 10:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago