2009 లో సతోషి నకమోటో (Satoshi Nakamoto) అనే అజ్ఞాత వ్యక్తి నుంచి మొదలైన బిట్ కాయిన్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా నెంబర్ వన్ కరెన్సీగా మారింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా మొదలైన ఈ డిజిటల్ కరెన్సీ విలువ 2010లో ఇండియన్ కరెన్సీలో కేవలం 2 రూపాయలు. ఇక ఇటీవల బిట్‌కాయిన్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఒక్క బిట్‌కాయిన్ ధర ఇప్పుడు 1,25,245 డాలర్లు, అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1.11 కోట్లు.
ట్రేడ్ మార్కెట్ లో అలాగే బిజినెస్ మెన్స్ కు దీని గురించి బాగా తెలిసినా సాధారణ జనాలకు దీనిపై అవగాహన చాలా తక్కువ. 15 ఏళ్ల క్రితం బిట్‌కాయిన్‌తో కేవలం రెండు పిజ్జాలు కొనేంతే విలువ ఉండేది. కానీ ఇప్పుడు అది కోట్లలోకి చేరింది. ఎందుకంటే బిట్‌కాయిన్ సాధారణ కరెన్సీ కాదు.. అది డిజిటల్ మనీ, అంటే ఇంటర్నెట్‌లో మాత్రమే ఉండే కరెన్సీ. బిట్‌కాయిన్ విలువ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. అది పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది.
మొత్తం 21 మిలియన్ల బిట్‌కాయిన్‌లు మాత్రమే మైన్ చేయవచ్చు. అంటే కొత్తగా మరిన్ని తయారు చేయలేరు. దీని సరఫరా తగ్గిపోతే డిమాండ్ పెరుగుతుంది, దాంతో విలువ కూడా ఆకాశాన్నంటుతుంది. ఇది బంగారం లాగా.. కొద్దిగా అందుబాటులో ఉండే డిజిటల్ కరెన్సీ కాబట్టి దాని ధర ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ డిమాండ్ కు మరొక ముఖ్యమైన కారణం, దీని వెనుక ఏ బ్యాంక్, ప్రభుత్వం లేకపోవడం. బిట్‌కాయిన్ పూర్తిగా డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అంటే ఎవరూ దీన్ని నియంత్రించలేరు.
దీని లావాదేవీలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా రికార్డ్ అవుతాయి.. అంటే ఎవరు ఎవరికీ డబ్బు పంపారు అనే వివరాలు మాత్రమే పబ్లిక్‌గా ఉంటాయి, కానీ ఎవరు (పేర్లు) అన్నది మాత్రం రహస్యం. అందుకే చాలా మంది దీన్ని సేఫ్, ఫ్రీ కరెన్సీగా చూస్తారు. అదే సమయంలో, బిట్‌కాయిన్ విలువ మార్కెట్ డిమాండ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరైనా ఎక్కువగా కొనుగోలు చేస్తే ధర పెరుగుతుంది, అమ్మకాలు ఎక్కువైతే పడిపోతుంది. దీని వెనుక ఏ సెంట్రల్ బ్యాంక్ లేకపోవడం వల్ల, ఇది చాలా మార్పులు చవిచూస్తుంది. అంటే ఒక్కరోజులోనే లక్షల్లో లాభం లేదా నష్టం రావచ్చు. అందుకే ఇది హై రిస్క్, హై రివార్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వాలు ముద్రించే డబ్బు విలువ ద్రవ్యోల్బణం వల్ల మారిపోతుంది. కానీ బిట్‌కాయిన్ విలువను కేవలం డిమాండ్, మార్కెట్, పెట్టుబడిదారుల విశ్వాసం నిర్ణయిస్తాయి. అందుకే ఇప్పుడు ఇది ఒక పెట్టుబడి ఆస్తిగా మారింది. కొందరికి ఇది భవిష్యత్ మనీ, మరికొందరికి ఇది సాహసకరమైన గేమ్. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమే.. డిజిటల్ కరెన్సీ యుగం మొదలైంది, దానికి బిట్‌కాయిన్ నాయకత్వం వహిస్తోంది.
This post was last modified on October 7, 2025 11:34 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…