మధ్యప్రదేశ్‌లోని చిన్నద్వారా జిల్లాలో పిల్లల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సిరప్ వాడిన తర్వాత 11 మంది చిన్నారులు మరణించడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి సదరు మందును సూచించిన పీడియాట్రిషన్ డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆయన ప్రభుత్వ వైద్యుడే అయినప్పటికీ తన ప్రైవేట్ క్లినిక్‌లో పిల్లలకు ఈ కఫ్ సిరప్ వాడమని సూచించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. మరణించిన పిల్లల్లో ఎక్కువమంది సోనీ ప్రైవేట్ క్లినిక్‌లోనే చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీశాన్ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీపై కూడా కేసు నమోదు చేశారు.
ఇదే కంపెనీ కోల్డ్రిఫ్ కఫ్ సిరప్ తయారీదారు. నమూనాలను పరిశీలించిన అధికారులు, ఆ సిరప్‌లో 48.6 శాతం డైఇథిలీన్ గ్లైకాల్ అనే అత్యంత విషపూరిత పదార్థం ఉన్నట్లు గుర్తించారు. దీనివల్లే పిల్లల కిడ్నీలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. చెన్నై డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఈ మందును “నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ”గా ప్రకటించింది.
దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ విక్రయాన్ని నిషేధించింది. అదనంగా, అదే కంపెనీ తయారు చేసిన నెక్ట్రో-డీఎస్ కఫ్ సిరప్ విక్రయాన్నీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ రెండు మందులపై మరిన్ని పరీక్షలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. పిల్లల కుటుంబాల పరిస్థితి మరింత బాధాకరంగా ఉంది. సెప్టెంబర్ ప్రారంభంలో కొందరు పిల్లలకు జలుబు, జ్వరం వచ్చిన తర్వాత ఈ మందు వాడారు. మొదట బాగానే కనిపించినా కొద్ది రోజులకే మూత్ర విసర్జన తగ్గడం, కిడ్నీ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు కనిపించాయి. వైద్య పరీక్షల్లో డైఇథిలీన్ గ్లైకాల్ వల్లే కిడ్నీలు పాడైనట్లు నిర్ధారించబడింది. పిల్లల మరణాలతో ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
This post was last modified on October 5, 2025 2:06 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…