Trends

పాక్ కెప్టెన్ అతి చూశారా?

ఆసియా కప్ టీ20 టోర్నీ సందర్భంగా ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఎన్నడూ చూడని ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం దాడి అనంతరం పరిణామాలతో పాకిస్థాన్‌తో మ్యాచ్ వద్దే వద్దంటూ స్వదేశంలో నిరసనలు సాగుతున్న సమయంలో ఆ జట్టుతో తలపడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు సభ్యులతో కనీసం కరచాలనం కూడా చేయలేదు. దానికి బదులుగా తర్వాతి మ్యాచ్‌లో ఒక పాక్ ఆటగాడు గన్ ఫైర్ సంబరాలతో కవ్వించే ప్రయత్నం చేస్తే.. మరో ఆటగాడు భారత యుద్ధ విమానాలను పాక్ నిజంగానే కూల్చేసినట్లుగా 6-0 సంజ్ఞతో రెచ్చగొట్టాలని చూశాడు.

ఇక ఫైనల్ సందర్భంగానూ ఇరు జట్ల ఆటగాళ్లలో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరాయి. ముచ్చటగా మూడోసారి పాక్‌ను ఓడించిన భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో పాకిస్థాన్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి ట్రోఫీని ప్రదానం చేయాల్సి ఉండగా.. భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్పు తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ట్రోఫీ ప్రదానమే జరగలేదు.

మరో అతిథి చేతుల మీదుగా ఇండియాకు కప్పు ఇచ్చే అవకాశమున్నా.. నఖ్వి అందుకు ఒప్పుకోకపోవడంతో ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది భారత జట్టు.
భారత్ చర్యను ఖండిస్తూ ఇండియన్ టీం క్రికెట్‌ను అగౌరవపరిచిందని పేర్కొన్నాడు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా. అలా అన్నవాడు ప్రెజెంటేషన్ టైంలో, తర్వాత ప్రెస్ మీట్‌లో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. రన్నరప్ కింద అతడికి చెక్ అందజేయగా అది అందుకున్న అనంతరం దాన్ని అతను విసిరి అవతల పడేసి మ్యాచ్ ప్రెజెంటర్ దగ్గరికి వెళ్లాడు. క్రికెట్‌ను అగౌరవపరచడం అంటే ఇదీ అంటూ అతడి మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీ ద్వారా వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి, సైన్యానికి అందిస్తున్నట్లు ప్రకటించాడు.
దీన్ని పాక్ కెప్టెన్ కాపీ కొట్టాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి తమ మ్యాచ్ ఫీజులను ఇస్తామన్నాడు. ఐతే ఆపరేషన్ సిందూర్‌లో భారత్ మట్టుబెట్టింది ఉగ్రవాదుల శిబిరాలను అని ప్రపంచానికి తెలుసు. వాళ్ల కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం అంటే ఉగ్రవాదులకు తమ ప్రోత్సాహం ఉంటుందని చెప్పడమే. పాకిస్థాన్ టెర్రరిస్ట్ కంట్రీ అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలంటూ మన వాళ్లు కౌంటర్లు వేస్తున్నారు.

This post was last modified on September 29, 2025 2:52 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pak captain

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago