Trends

భారత్ vs పాక్ ఫైనల్: ఈ సెంటిమెంట్ కలిసొస్తే డేంజరే..

ఆసియా కప్‌లో ఇప్పటికే రెండు సార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌ ఇప్పుడు ఫైనల్‌లో మూడోసారి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీగ్ దశలోనూ, సూపర్‌ 4లోనూ సూర్యకుమార్ సేన ఆధిపత్యం చాటినా, ఫైనల్ వాతావరణం మాత్రం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. కాబట్టి జట్టు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు.

పాకిస్థాన్ బౌలింగ్ లైన్‌అప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అందరికీ తెలిసిందే. బ్యాటింగ్‌లో కాస్త వీక్‌గా కనిపించినా, బౌలర్లు మ్యాచ్‌ను తిప్పేసే సామర్థ్యంలో ఉన్నారు. ఇక భారత్ విషయానికి వస్తే, బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఫైనల్ ఒత్తిడి, పరిస్థితులు మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే సూర్యకుమార్ అండ్‌ కో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే.

ఈసారి మరో అంశం ఎక్కువగా చర్చనీయాంశమైంది. సూర్యకుమార్ చేసిన పహల్గాం కామెంట్స్, మ్యాచ్ అనంతరం ‘నో షేక్ హ్యాండ్’ కౌంటర్ వల్ల పాక్ ఆటగాళ్లలో, అభిమానుల్లో ఉగ్ర వేడి గట్టిగానే ఉంది. ఫైనల్‌లో ఏ చిన్న తప్పిదం జరిగినా ఆగ్రహం రెట్టింపు అవుతుంది. అందుకే టీమ్ ఇండియా పట్టు వదులుకోకుండా ఆడాలి. గత రికార్డులు చూస్తే ఇతర టోర్నీల ఫైనల్ ఫైట్స్ లలో పాకిస్థాన్‌దే పైచేయి కనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ పరంగా చూస్తే డేంజర్ అనే చెప్పాలి.

ఇండియా vs పాక్ ఫైనల్స్.. గత టోర్నీల రికార్డులు ఇలా ఉన్నాయి.

1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్: భారత్ 8 వికెట్లతో విజయం

1986 ఆస్ట్రల్ ఆసియా కప్: పాకిస్థాన్ 1 వికెట్‌తో విజయం

1991 విల్స్ ట్రోఫీ: పాకిస్థాన్ 72 పరుగులతో విజయం

1994 ఆస్ట్రల్ ఆసియా కప్: పాకిస్థాన్ 39 పరుగులతో విజయం

1998 సిల్వర్ జూబిలీ కప్ (1వ ఫైనల్): భారత్ 8 వికెట్లతో విజయం

1998 సిల్వర్ జూబిలీ కప్ (2వ ఫైనల్): పాకిస్థాన్ 6 వికెట్లతో విజయం

1998 సిల్వర్ జూబిలీ కప్ (3వ ఫైనల్): భారత్ 3 వికెట్లతో విజయం

1999 పెప్సీ కప్: పాకిస్థాన్ 123 పరుగులతో విజయం

1999 కోకా కోలా కప్: పాకిస్థాన్ 8 వికెట్లతో విజయం

2007 ఐసీసీ వరల్డ్ T20: భారత్ 5 పరుగులతో విజయం

2008 కిట్‌ప్లీ కప్: పాకిస్థాన్ 25 పరుగులతో విజయం

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ 158 పరుగులతో విజయం

అయితే ఈసారి మాత్రం కథ మారవచ్చని నమ్మకం పెరిగింది. ఎందుకంటే గత పది మ్యాచ్‌లలో ఇండియా ఎనిమిది సార్లు పాక్‌పై గెలిచింది. ఇది ప్రస్తుత జట్టు శక్తిని సూచించే గణాంకం. అలాగే ప్రస్తుత స్క్వాడ్‌లో అనుభవం గల ఆటగాళ్లు, యూత్ ఉండటం వల్ల టీమ్ బలంగా కనిపిస్తోంది. కానీ అభిషేక్ తప్ప మిగతా ఆటగాళ్ల నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదన్నది ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సూర్యకుమార్, సంజూ శాంసన్ ఫామ్‌లోకి వస్తే జట్టు మరింత శక్తివంతంగా మారుతుంది. ఇక బౌలింగ్ పరంగా చూసినా బుమ్రా, కుల్దీప్, వరుణ్ కట్టడి చేసే శక్తి ఉన్నవారు. ఏదేమైనా బైకాట్ నినాదం నుంచి ఇండియా vs పాక్ ఫైనల్ వరకు వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on September 26, 2025 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

57 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago