పంజాబ్‌కు చెందిన 73 ఏళ్ల హర్జీత్ కౌర్ అమెరికాలో మూడు దశాబ్దాలపాటు నివసించి చివరికి స్వదేశానికి ఊహించని కోణంలో రావాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో తన ఇద్దరు కుమారులతో కలిసి స్థిరపడిన ఆమె, 1992 నుంచి ఈస్ట్ బే ప్రాంతంలో ఉంటోంది. అయితే, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు రొటీన్ గా చెక్ చేస్తూ అ తరువాత ఆమెను అదుపులోకి తీసుకుని డిపోర్ట్ చేశారు.
ఆమె న్యాయవాది దీపక్ అహ్లువాలియా ఇచ్చిన వివరణ ప్రకారం, డిపోర్ట్ చేసే విమానంలో హర్జీత్ కౌర్‌తో పాటు 131 మందిని చిన్న చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో తీసుకువెళ్లారు. ఈ ప్రయాణంలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని, ఆమె నేలపై నిద్రించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. మోకాళ్లకు శస్త్రచికిత్సలు చేయించుకున్న ఆమెకి లేవడం కూడా కష్టమైందని చెప్పారు. ఇంకా షవర్ సదుపాయం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఒక దశలో అధికారులు ఆమెను బంధించాలని ప్రయత్నించగా, వయసు కారణంగా మరొక అధికారి ఆపినట్టు న్యాయవాది వెల్లడించారు.
అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ ఘటనను విమర్శించారు. కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్ నాయకుడు జాన్ గారమండీ, “ఒక 73 ఏళ్ల మహిళను, అదీ నేరచరిత్ర లేని వ్యక్తిని ఇలా బలవంతంగా డిపోర్ట్ చేయడం సరికాదు” అంటూ ట్రంప్ ప్రభుత్వాన్ని ఆక్షేపించారు.
హర్జీత్ కౌర్ 2012లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసినా తిరస్కరించబడింది. అయినప్పటికీ, ఆమె ఎప్పుడూ ICE అధికారుల వద్దకు విధిగా వెళ్ళేది. 13 ఏళ్ల పాటు ఆరు నెలలకు ఒకసారి హాజరు అవుతూ, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు చేయలేదని ఆమె కోడలు మంజీ కౌర్ తెలిపారు. “ఆమె ఎల్లప్పుడూ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసేది, ప్రతి సంవత్సరం టాక్స్ కూడా చెల్లించేది. డ్రైవింగ్ వైలేషన్ కూడా ఎప్పుడూ లేదు” అని మంజీ పేర్కొన్నారు.
అమెరికా అధికారులు ఇటువంటి డిపోర్టేషన్ విమానాల్లో మహిళలు, వృద్ధులకు కూడా హింసాత్మకంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటనతో, ఇమ్మిగ్రేషన్ విధానాలపై అమెరికాలో మళ్లీ చర్చలు చెలరేగాయి. హర్జీత్ కౌర్ వంటి వలసదారులు న్యాయపరంగా నిబద్ధతతో ఉన్నా, మానవత్వం లేకుండా వ్యవహరించడం ఆగ్రహానికి దారితీస్తోంది.
This post was last modified on September 26, 2025 7:16 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…