ఆసియా కప్ 2025లో ఇండియా – పాక్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న “నో హ్యాండ్‌షేక్” వివాదం ఊహించని స్థాయికి చేరింది. ఈ అవమానాన్ని తట్టుకోలేని పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఇండియన్ జట్టుపైనే కాకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై కూడా ఆరోపణలు చేసింది. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ చేతులు కలపకూడదని పైక్రాఫ్ట్ ఆదేశించారని పాక్ ఆరోపించింది. అందుకే ఆయన్ని వెంటనే రిఫరీ ప్యానెల్ నుంచి తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది.
అయితే ఈ డిమాండ్‌కు ఐసీసీ తక్షణమే స్పందించి పాక్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. రిఫరీపై ఎలాంటి చర్య తీసుకోలేమని స్పష్టం చేసింది. పైక్రాఫ్ట్‌ను తొలగించే అభ్యర్థనను తిరస్కరించినట్లు ఒక ICC అధికారి మీడియాకు తెలిపాడు. ఈ నిర్ణయం పాక్‌కు మరో అవమానం కావడంతో ఇప్పుడు అక్కడి క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నక్వీ, “ఈ రిఫరీ ప్రవర్తన ఆట తీరుకు వ్యతిరేకం. MCC చట్టాలను ఉల్లంఘించాడు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా, UAEతో జరిగే తమ తదుపరి మ్యాచ్‌ను కూడా బహిష్కరిస్తామని అన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ వివరణ అధికారిక ప్రకటనగా రాలేదని తెలుస్తోంది, పాక్ మీడియా మాత్రమే రిపోర్ట్ చేసిందట.
ప్రస్తుతం పాక్ జట్టు ఆసియా కప్ సూపర్-4కి చేరాలంటే UAEపై తప్పనిసరిగా గెలవాలి. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచిన పాక్, UAEను ఓడిస్తేనే తదుపరి రౌండ్‌లోకి ప్రవేశిస్తుంది. గెలిస్తే మళ్లీ ఆదివారం ఇండియానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి హ్యాండ్‌షేక్ వివాదం కొనసాగుతున్నా, మైదానంలో పాక్ జట్టుకు గెలుపే ప్రధాన సవాలు. మరోవైపు భారత జట్టు మాత్రం మైదానంలో గెలుపుతో, మైదానం బయట సైలెంట్ కౌంటర్‌లతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఫ్యాన్స్ కళ్లన్నీ సెప్టెంబర్ 17న జరిగే పాక్ UAE పోరుపైనే నిలిచాయి. అక్కడి ఫలితమే ఈ ఆసియా కప్‌లో మరో ఇండియా – పాక్ మ్యాచ్ కి ప్రణాలిక సిద్ధం చేయనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates