దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఆదివారం.. చంద్రగ్రహణం ఉండడంతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన గణపతి పందిళ్ల నుంచి విఘ్ననాయకులు.. నిమజ్జనానికి కదిలారు. శనివారం సాయంత్రం నాటికి దాదాపు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ.. నిమజ్జన ఘట్టాలు ముగియనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వినాయకుడు ఖరతాబాద్ గణపతి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం ముగిసింది. ఇలా.. దేశవ్యాప్తంగా గణపతి భక్తులు భక్తిలో ఓలలాడుతున్నారు.
ఇదేసమయంలో గణపతి ఉత్సవాల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన లడ్డూలను నిర్వాహకులు వేలం వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ వేలం పాటలు సాగుతున్నాయి. తాజాగా బాలాపూర్ లడ్డూను ఒకరు 35 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఇక, ఇదే హైదరాబాద్‌లోని బండ్ల గూడలో ఉన్న విల్లాలో నిర్వహించిన లడ్డూ వేలంలో పాల్గొన్న ఓ వ్యక్తి ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు వెచ్చించి.. గణపతి లడ్డూను దక్కించుకున్నారు.
ముంబైలో నిర్వహించిన వేడుకల్లో 3 కోట్ల రూపాయల వరకు లడ్డూ వేలం సాగింది. ఇలా.. దేశంలో లక్షల రూపాయలు వెచ్చించి.. గణపతి లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న భక్తులకు తాజాగా ఈడీ షాకిచ్చేందుకు రెడీ అయింది. మీడియాలో వస్తున్న వార్తలను ఆధారంగా చేసుకుని.. లడ్డూలను సొంతం చేసుకున్నవారి ఆదాయపన్ను వివరాలతోపాటు.. అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను కూడా రాబట్టే ప్రయత్నంలో ఉన్నట్టు జాతీయ మీడియా పేర్కొంది.
ఎవరూ ఫిర్యాదు చేయక్కర్లేదు!
కొన్నాళ్ల కిందట కర్ణాటకలో ఓ వ్యక్తి విదేశీ జాతి కుక్క అంటూ.. ఓ శునకంతో రోడ్డు మీదకు వచ్చాడు. దీని ఖరీదు కోటిరూపాయలని ప్రచారం చేశాడు. దీంతో ఈడీ అతని ఇంటిపై దాడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అలానే.. ఇప్పుడు కూడా ఎవరూ ఫిర్యాదు చేయకుండానే రూ.10 లక్షలకు పైగా వెచ్చించి లడ్డూలు వేలంలో దక్కించుకున్నవారిపై తనిఖీలు తప్పదని తెలుస్తోంది. ముఖ్యంగా కోట్ల రూపాయలు వెచ్చించడంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టనుంది.
This post was last modified on September 6, 2025 6:02 pm
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…