ఆంధ్రప్రదేశ్ వాసులకు వర్షాల పరీక్ష ఇంకా పూర్తికాలేదట. బంగాళాఖాతం మీద వరుస అల్పపీడనాలు ఏర్పడటంతో రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించిన తొలి రెండు నెలల్లో పెద్దగా వర్షాలు రాకపోయినా, ఆ లోటు ఆగస్టులో పూడ్చాయి. ఇప్పుడు సెప్టెంబరులోనూ అదే ధోరణి కనిపిస్తోందని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
ఇటీవల విశాఖపట్నం పరిసరాల్లో ఏర్పడిన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తేలికపాటి వర్షాలే కురుస్తాయి. కానీ వాతావరణ మార్పులతో ఈసారి వాయుగుండం తరహాలో వర్షపాతం నమోదవుతోందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అమెరికాకు చెందిన నోవా మోడల్ అంచనా వేస్తోంది.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం రాబోయే మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచవచ్చని, ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచనలు ఇచ్చారు. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగలలో 70.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
దేశవ్యాప్తంగా కూడా ఈసారి సెప్టెంబరు వర్షాలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. నెలవారీ సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే 109 శాతం అధికంగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మొత్తానికి ఆగస్టులో ఊపందుకున్న వర్షాలు ఇప్పుడు సెప్టెంబరులోనూ కొనసాగుతున్నాయి. వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
This post was last modified on September 1, 2025 8:05 am
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక వింత సంఘటన జరిగింది. రిసెప్షన్ వేదిక రెడీ, బంధువులంతా వచ్చేశారు, విందు భోజనాలు సిద్ధం. కానీ…
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…