ప్రతి ఏడాది యాపిల్ కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ చేస్తే టెక్ ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈసారి కూడా అదే పరిస్థితి. సెప్టెంబర్ 9న జరగబోయే యాపిల్ బిగ్ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నారు. అయితే, ఈసారి ఫోన్లలో భారీ అప్‌గ్రేడ్‌లు రాబోతున్నాయనే కారణంగా ధరలు కూడా పెరగనున్నాయన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
లీకైన సమాచారం ప్రకారం, ఐఫోన్ 17 సిరీస్‌లో నాలుగు మోడల్స్ రాబోతున్నాయి.
ఐఫోన్ 17
ఐఫోన్ 17 ఎయిర్
ఐఫోన్ 17 ప్రో
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్.
గతంలో ఐఫోన్ 16 మోడల్స్‌తో పోలిస్తే, ఈసారి సుమారు 50 డాలర్ల వరకు పెరుగుదల ఉంటుందని అంచనా. ఇది టెక్ ప్రియుల్లో చర్చనీయాంశమైంది.
అమెరికా మార్కెట్లో లీకైన ధరల ప్రకారం, ఐఫోన్ 17 బేస్ మోడల్ (128జీబీ) ధర $849గా ఉండొచ్చని, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.84,990గా అంచనా వేస్తున్నారు.
ఇక ఐఫోన్ 17 ప్రో మోడల్ ధర $1,049గా ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు రూ.1,24,990 అవుతుంది.
టాప్ వేరియంట్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర $1,249 (దాదాపు రూ.1,50,000) వరకు చేరవచ్చని సమాచారం.
యాపిల్ ఇప్పటి వరకు ధరలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఈ లీకులు వినియోగదారుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఎందుకంటే, గతంలో కూడా లీకైన ధరలు చాలా సార్లు నిజమయ్యాయి. అదనంగా, ఈ సిరీస్‌లో కొత్త ఫీచర్లు, మెరుగైన కెమెరా పనితనం, అధునాతన చిప్‌సెట్ ఉండబోతున్నాయని సమాచారం.
ఫైనల్ గా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న, ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌కి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో టెక్ ప్రపంచం అంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. సెప్టెంబర్ 9 రాత్రి 10.30 గంటలకు జరిగే ఈవెంట్‌ను Apple.com, Apple TV ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ధరలు పెరిగినా, ఫీచర్లలో వచ్చే అప్‌గ్రేడ్‌ల కారణంగా ఈ ఫోన్లు మరోసారి రికార్డు బుకింగ్స్ సాధిస్తాయన్న అంచనాలు ఉన్నాయి.
This post was last modified on August 29, 2025 1:20 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…