అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య విషయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో అప్పుడే అడ్వాన్స్ గా ఫోకస్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అమెరికా రాజకీయ వాతావరణంలో కొత్త చర్చలకు కారణమయ్యేలా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాను ఎప్పుడైనా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.
వాన్స్ యూఎస్ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఆరోగ్యాన్ని బలంగా సమర్థించారు. “అధ్యక్షుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనతో పనిచేసే వారంతా చిన్నవాళ్లే అయినా.. వారందరికంటే ఆలస్యంగా నిద్రపోయే వారు ట్రంప్, ఉదయం తొలుత లేచే వారు కూడా ఆయనే” అని వాన్స్ చెప్పారు. అయినా సరే, జీవితంలో ఎప్పుడూ అంచనా వేయలేని పరిస్థితులు వస్తాయని, ఒకవేళ విషాదం జరిగితే అధ్యక్షుడిగా తాను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.
ఇటీవల ట్రంప్‌కి దీర్ఘకాల సిరల వ్యాధి ఉందని వైట్‌హౌస్ ప్రకటించడంతో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఇది సాధారణ సమస్యేనని వైట్‌హౌస్ వివరించినా, అమెరికా రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ట్రంప్ మాత్రం మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ (మాగా) ఉద్యమానికి వారసుడు వాన్స్ అవుతారని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించవచ్చని అన్నారు.
అమెరికా 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా వాన్స్ పేరు వినిపించే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ అనారోగ్యం కారణంగా ఆయన పదవీకాలం మధ్యలో ఆగిపోతే వాన్స్‌కి నేరుగా అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
మొత్తానికి, జేడీ వాన్స్ చేసిన ఈ ప్రకటన ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు, రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు, వాన్స్ రాజకీయ ప్రయాణంపై కొత్త ఊహాగానాలకు దారితీస్తోంది. అమెరికా రాజకీయాల్లో మాగాకు వారసుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నంలో వాన్స్ పేరు మున్ముందు ఎక్కువగా వినిపించేలా ఉంది.
This post was last modified on August 29, 2025 12:29 pm
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…