Trends

ఎక్కడివారక్కడే!…తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం!

తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో గడచిన కొన్ని రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రోజుల తరబడి వర్షం కురుస్తుండగా… తాజాగా బుధవారం నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బుధవారం రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. ప్రయాణాలు దాదాపుగా నిలిచిపోయాయి. పలు పట్టణాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దని ఇరు రాష్ట్రాల ప్రజలకు అధికార యంత్రాంగం సూచించింది.

ఏపీలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. వాగులు, వంకలకు దగ్గరగా ఉన్న కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో చాలా ప్రాంతాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. ఫలితంగా రాజధాని అమరావతికి పలు పట్టణాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు విజయవాడ నుంచి కూడా అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలతో చాలా జిల్లాల్లో అధికార యంత్రాంగం రెడ్ అలెర్ట్ ప్రకటించింది.

మరోవైపు తెలంగాణ విషయానికి వస్తే… రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి మొదలైన వర్షం బుధవారం సాయంత్రం దాకా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా గురువారం రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే గడచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీటితో అలుగులు పొంగి పొరలుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా పది జిల్లాలకు పైగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.

రంగంలోకి బాబు, రేవంత్…

భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలోకి దిగిపోయారు. వర్షం కారణంగా పోటెత్తే వరదల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని వారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలువురు మంత్రులతో మాట్లాడిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… తాజాగా బుధవారం కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ భేటీలతో మంత్రులతో పాటుగా అన్ని జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం వర్చువల్ గా పాలుపంచుకోనున్నారు. వర్షం వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే దిశగా ముందస్తు చర్యలకు బాబు అధికార యంత్రాంగాన్ని ఆదేశించనున్నారు. మరోవైపు మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఎక్కడికక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా పలు కీలక శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

This post was last modified on August 13, 2025 5:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

46 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

1 hour ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

2 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

6 hours ago