Trends

2027 వరల్డ్‌కప్: విరాట్ – రోహిత్ ఉండాలంటే..

టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం వన్డే క్రికెట్‌లోనే ఉన్నారు. కానీ 2027 వన్డే ప్రపంచకప్‌లో వీరి ప్రస్థానం కొనసాగాలంటే బీసీసీఐ ఒక కీలక షరతు పెట్టినట్లు క్రికెట్ వర్గాల సమాచారం. ఈ కండీషన్ కు ఒప్పుకోకపోతే, వన్డే ఫార్మాట్‌లో కూడా వీరి ప్రయాణం త్వరగా ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

లేటెస్ట్ టాక్ ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమయ్యే దేశవాళీ విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ తప్పనిసరిగా ఆడాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్, ఫామ్‌ను నిరూపించుకునే వేదికగా ఈ టోర్నీని ఉపయోగించుకోవాల్సిందేనని సూచన వచ్చింది. ఇందులో ఆడకపోతే, 2027 వరల్డ్‌కప్ జట్టులో వీరికి స్థానం కల్పించడం కష్టమని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయట. 

రోహిత్, కోహ్లీ భవిష్యత్తు గురించి వచ్చే రెండు నెలల్లోనే స్పష్టత రానుంది. త్వరలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో వీరిని ఎంపిక చేస్తారా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. రోహిత్ పరిస్థితిపై స్పష్టత లేకపోయినా, కోహ్లీ మాత్రం లండన్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్ శర్మే కెప్టెన్. ఇటీవలే ఆయన సారథ్యంలో టీమ్‌ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. అయితే బీసీసీఐ భవిష్యత్ దృష్ట్యా యువ జట్టును సిద్ధం చేయాలనుకుంటే, శుభ్‌మన్ గిల్‌కు వన్డే కెప్టెన్సీ అప్పగించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. ఇది జరిగితే, రోహిత్ కోహ్లీ త్వరలోనే గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనా రాబోయే వరల్డ్ కప్ వరకు ఈ ఇద్దరు దిగ్గజాల క్రికెట్ ప్రయాణం కొనసాగాలంటే బీసీసీఐ షరతు తీరడం తప్పనిసరి. ఫిట్‌నెస్, ఫామ్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో పాల్గొని తమ అంకితభావాన్ని చూపించాల్సిన సమయం ఇది. మరి ఈ ఇద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

This post was last modified on August 10, 2025 2:44 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

11 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago