వెనుజులా.. ప్రపంచంలో మాదక ద్రవ్యాల రవాణాలో ముందున్న దేశంగా ప్రాచుర్యం ఉంది. ఈ దేశ అధ్య క్షుడు.. నికోలస మదురోని అరెస్టు చేయాలని అమెరికా భావిస్తోంది. అయితే.. ఆయన అంతుచిక్కని నాయకుడిగా మారారు. అమెరికాను, ఆదేశ ఆధిపత్యాన్ని కూడా తృణప్రాయంగా భావిస్తున్నారు. పైగా.. అమెరికాను టార్గెట్ చేసు కుని మాదక ద్రవ్యాలను(డ్రగ్స్)ను రవాణా చేస్తున్నారు. ఇటీవల 30 టన్నుల కొకైన్‌ను పట్టుకున్న ఎఫ్ బీఐ అధికారులు దీనికి మూలాలు.. వెనుజులా అధ్యక్షుడి వద్దే ఉన్నాయని గుర్తించారు.
ఇదొక్కటే కాదు.. గత ఐదారేళ్లుగా కూడా వెనుజులా అధ్యక్షుడు మదురో.. అమెరికాకు భారీ ఎత్తున రహస్య మార్గాల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ప్రత్యేక ఆధారా లను సమర్పించలేక పోయింది. తాజాగా 30 టన్నుల డ్రగ్స్‌ను ఎఫ్ బీఐ అధికారులు స్వాధీనం చేసుకుని దీనివెనుక మదురో పాత్ర ఉందని నిరూపించారు. ఈ నేపథ్యంలో వెనుజులా అధ్యక్షుడిని అరెస్టు చేసేం దుకు అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ, వెనుజులాకు ఉన్న బలమైన మిత్రదేశాల ఫలితంగా అమెరికా ఈ పనికి ప్రయత్నించడం లేదు.
ఈ నేపథ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తమకు సహకరించాలని.. అలా సహకరించిన దేశానికి 50 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో 430 కోట్ల రూపాయలను నజరానాగా ఇవ్వనున్నట్టు తెలిపింది .ఈ మేరకు అమెరికా అటార్నీ జనరల్(అధికారిక న్యాయవాది) ఓ ప్రకటన చేశారు. అమెరికాను డ్రగ్స్ రహి తం చేయాలన్న సంకల్పంతో ఉన్నామని.. కానీ, వెనుజులా అధ్యక్షుడు అగ్రరాజ్యాన్ని టార్గెట్ చేసుకు న్నారని, దీనిని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో మదురోను అరెస్టు చేసేందుకు సహకరించాలని వెనుజులా మిత్ర దేశాలకు ఆయన పిలుపు నిచ్చారు. తమకు సహకరించిన వారిపై టారిఫ్‌లు కూడా రద్దు చేస్తామన్నారు. అదేసయమంలో 430 కోట్ల రూపాయల మేరకు నజరానా అందిస్తామన్నారు. అయితే.. అమెరికా పొరుగు దేశం మెక్సికో.. కూడా వెనుజులాకు మిత్ర దేశంగా ఉండడంతో అమెరికాకు ఆయనను అరెస్టు చేయడం ఇబ్బందిగా మారింది. దీంతోనే ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం.
This post was last modified on August 8, 2025 6:13 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…