ఈ రోజుల్లో ‘డేటింగ్ యాప్స్’ పేరుతో యువకులు కొత్త మోసాలకు బలి అవుతున్నారు. సింగిల్స్‌కు, పెళ్లి కాని ప్రసాదులకు నెట్లో పరిచయాలు పెరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి డేటింగ్ యాప్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయమయ్యాడు. కొన్నాళ్లే కాకుండా ఆ యువతి తనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెప్పి రూ.70,000 దక్కించుకుంది. తర్వాత మళ్లీ డబ్బు అడిగినప్పుడు మోసపోయానని గ్రహించాడు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదే తరహాలో, కొంతమంది యువకులు అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లు సృష్టించి డేటింగ్ యాప్‌లో యువకులను వలలో పడేస్తున్నారు. కలుద్దామని చెప్పి, ఖరీదైన హోటల్‌లో గది బుక్ చేయించి, చివరకు బెదిరింపులు, డబ్బుల వసూళ్లు చేస్తున్న ఘటనలు ఇటీవల బయటపడుతున్నాయి. అసలు అమ్మాయిలు అని నమ్మించి, ఏకాంతంగా వీడియో కాల్ చేస్తామని ఆశ చూపించి, డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత మాయమవుతున్నారు.
వాస్తవంగా, ఈ డేటింగ్ యాప్స్ పట్ల ముఖ్యంగా యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే లింకులు, ర్యాండమ్ యాప్‌లను గుడ్డిగా నమ్మకూడదు. మీ వివరాలు, ఫోటోలు ఎవరికైనా పంపకూడదు. డబ్బులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఈ డేటింగ్ యాప్‌లు ఎక్కువగా టీనేజ్ పిల్లలు, పెళ్లి కాని ప్రసాదులు వాడుతున్నారు. మగవాళ్ల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకునే ముఠాలు మరింత యాక్టివ్‌గా ఉన్నాయి. పోలీసులు ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినా రోజుకో కొత్త ఫార్మాట్‌లో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
This post was last modified on August 8, 2025 10:36 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…