Trends

ఈ చదువు నాతోని కాదు.. చనిపోతున్నా!

“మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి. కానీ నాతో మాత్రం ఈ చదువు కాదు. ఎంతగా ట్రై చేసినా నాకు చదువు అర్థం కావడం లేదు. చివరకు చావే నాకు దిక్కయింది,” అని రాసిన ఆ విద్యార్థిని ఆత్మహత్య లేఖ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ విషాద ఘటన హనుమకొండ నయీంనగర్‌లో చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న మిట్టపల్లి శివాని (16) తాను ఎదుర్కొన్న మానసిక వేదన, చదువులోని ఒత్తిడిని భరించలేక చివరికి తనువు చాలించింది.

శివాని లేఖలో స్పష్టంగా తన మనసులో ఉన్న బాధను వివరించింది. “మీరంతా నన్ను మంచిగా చదువుకుంటానని ఆశపడుతున్నారు. కానీ నాకు ఈ చదువు అర్థం కావడం లేదు. ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. ప్రతిసారి చదవలేకపోయినప్పుడు మీకు, టీచర్లకు చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే నేను నలిగిపోతున్నాను,” అంటూ శివాని తన మనస్థితిని ఆ లేఖలో వివరించింది.

తన చెల్లిని కూడా తనలా చేయొద్దని, ఆమెకు బాగా చదువు చెప్పాలని తల్లిదండ్రులను కోరుతూ రాసింది శివాని. చివరి క్షణాల్లో కూడా తన చెల్లెలిపై ఉన్న ప్రేమ, బాధ్యత చూపిస్తూ, తన పరిస్థితి చెల్లికి రాకూడదని కోరింది. తన ఆత్మహత్య ద్వారా తల్లిదండ్రులు తమ పరిస్థితిని గుర్తించాలని ఆమె రాసిన లేఖలో కనిపిస్తోంది.

విద్యార్థులు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం చదువుపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు పెడుతున్న అత్యధిక ఒత్తిడే అని నిపుణులు అంటున్నారు. విద్యార్థులు ఇష్టంలేని కోర్సులను తల్లిదండ్రుల కోరికల మేరకు ఎంచుకుని, ఆ తర్వాత ఆ ఒత్తిడిని తట్టుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. ఇలాంటి విద్యార్థుల మనస్థితిని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి వారికి మానసిక అండనిస్తే, ఇలాంటి విషాద ఘటనలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. కానీ ఏటా వేల సంఖ్యలో ఇలాంటి ఆత్మహత్యలు ఎక్కడో ఒక చోట కలచివేస్తూనే ఉన్నాయి. చదువు విషయంలో బలవంతం చేయడం కాకుండా, పిల్లల ఆసక్తులను గౌరవించి, వారికి తగినట్లు మద్దతు ఇవ్వడమే సమస్యలకు పరిష్కారం. శివాని లేఖ ప్రతీ తల్లిదండ్రికి ఒక హెచ్చరికగానే మారింది.

This post was last modified on August 4, 2025 10:23 am

Share

Recent Posts

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

17 minutes ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

33 minutes ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

59 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

2 hours ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

2 hours ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

2 hours ago