Trends

అమెరికా మృత్యు లోయలో భారత సంతతి కుటుంబం

అధ్యాత్మ పర్యటన కోసం బయలుదేరిన భారత సంతతికి చెందిన నలుగురు వ్యక్తులు అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్‌లోని బఫెలో నగరం నుంచి వెస్ట్ వర్జీనియాలోని ప్రముఖ ఆధ్యాత్మిక స్థలం “ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్” దర్శనానికి వెళ్తున్న వీరు, మార్గం మధ్యలో జరిగిన ప్రమాదంలో మరణించారు. బఫెలో దివాన్ కుటుంబానికి చెందిన ఈ ఘటన విషాదం నింపింది.

మృతులను కిషోర్ దివాన్ (89), ఆశా దివాన్ (85), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)గా అధికారులు గుర్తించారు. జులై 29న నలుగురూ కలిసి 2009 మోడల్ టయోటా క్యామ్రీ కారులో వెస్ట్ వర్జీనియాకు బయలుదేరారు. మార్షల్ కౌంటీలోని బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్ వద్ద ఉన్న లోతైన లోయలో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ప్రమాదానికి గురై, అక్కడికక్కడే మరణించినట్లు మార్షల్ కౌంటీ షెరిఫ్ మైక్ డోగర్టీ అధికారికంగా ప్రకటించారు.

ఆ కుటుంబం చివరిసారిగా పెన్సిల్వేనియాలోని బర్గర్ కింగ్ రెస్టారెంట్‌లో కనిపించారు. సీసీటీవీ ఫుటేజీలో వీరిలో ఇద్దరు రెస్టారెంట్‌లోకి ప్రవేశించినట్లు, అక్కడే చివరి క్రెడిట్ కార్డు లావాదేవీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత పెన్సిల్వేనియా స్టేట్ పోలీసుల కెమెరా వీరి వాహనం ఐ-79 రహదారిపై పిట్స్‌బర్గ్ దిశగా వెళ్తున్నట్లు రికార్డ్ అయ్యి ఉంది.

ఆ కుటుంబం అదృశ్యమయ్యాక, నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో రిపోర్ట్ చేయడంతో పాటు, మార్షల్ – ఒహియో కౌంటీల పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చివరకు శనివారం రాత్రి లోయలో వీరి కారును గుర్తించారు. సహాయక బృందాలు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మృతదేహాలను వెలికితీశాయి.

ఈ ఘటనపై న్యూయార్క్‌లోని “కౌన్సిల్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా” (CHAI) సంస్థ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు సురక్షితంగా తిరిగిరావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని CHAI అధ్యక్షుడు సిబు నాయర్ తెలిపారు. మరోవైపు ఈ విషాద ఘటనపై స్థానిక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదం అమెరికాలో ఉన్న భారతీయుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

This post was last modified on August 3, 2025 9:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

21 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago