కరోనా పుణ్యమా అని ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోయిందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేవ్ రావటం.. షాకులు ఇవ్వటం.. వెళ్లిపోయినట్లే వెళ్లిపోయి.. సెకండ్ వేవ్ తో పలు దేశాల్ని అతలాకుతలం చేస్తోంది. తాజాగా మన దేశంలోనూ కేరళ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ షురూ కాలేదు. ఇదిలా ఉంటే.. వచ్చే నెలాఖరు నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందన్న అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పలు కంపెనీలు తమ వ్యాక్సిన్ పరీక్షా ఫలితాలు బాగానే వస్తున్నట్లు చెబుతున్నాయి.
అలాంటి కోవలోకే వస్తోంది ఫైజర్ తయారు చేస్తున్న వ్యాక్సిన్. తమ టీకా బాగా పని చేస్తుందని చెప్పిన కంపెనీ మాట పలువురికి ఊరటను ఇచ్చింది. అయితే.. ఈ టీకాను నిల్వ ఉంచటం సామాన్యమైన విషయం కాదంటున్నారు. ఎందుకంటే.. ఫైజర్ వ్యాక్సిన్ ను నిల్వ ఉంచాలంటే మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలన్న మాటకు విస్తుపోతున్నారు. ఎందుకంటే.. భారీ ఎత్తున నిల్వ ఉంచాల్సిన వ్యాక్సిన్ ను.. అలాంటి వాతావరణంలో ఉంచేంత సాంకేతికత చాలా దేశాల్లో లేదు.
ఆ మాటకు వస్తే.. మన దేశంలో అలాంటి పరిస్థితులు ఏ మాత్రం లేవన్న మాట వినిపిస్తోంది. ఉన్నవి చాలా పరిమితమని చెబుతున్నారు. ఇలాంటివేళ.. ఫైజర్ వ్యాక్సిన్ కొనుగోలు చేయటం పెద్ద విషయం కాదని.. దాన్ని నిల్వ ఉంచి ప్రజలకు ఇవ్వటంలోనే అసలు సమస్యగా భావిస్తున్నారు.దీంతో.. ఈ వ్యాక్సిన్ కొనుగోలు చేయాలని భావించిన కేంద్రం సైతం ఇప్పుడు సందేహంలో పడినట్లు చెబుతున్నారు.
ఫైజర్ టీకా కొనటం తప్పని పరిస్థితుల్లో దాన్ని నిల్వ ఉంచటం ఏలా అన్న అంశం మీద ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్ ను నిల్వ చేయటం ఏ దేశానికైనా సవాలుతో కూడిన అంశంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మోడెర్నా కూడా తాము డెవలప్ చేసిన వ్యాక్సిన్ బాగా పని చేసినట్లుగా చెబుతున్నారు. దీనిపై పలు దేశాలు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాయి.
This post was last modified on %s = human-readable time difference 6:59 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…