ఒక హత్య కేసులో కేరళకు చెందిన నర్సు ఒకరు దోషిగా తేలటమే కాదు.. ఆమెకు మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పునకు సంబంధించి అమలు తేదీని తాజాగా ఖరారు చేశారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ నెల 16న ఆమెకు ఊరిశిక్ష అమలు చేయనున్నారు. దేశం కాని దేశంలో ఆమె హత్య చేయటానికి కారణమేంటి? ఆమెను ఊరిశిక్ష నుంచి తప్పించేందుకు ఇప్పటివరకు జరిగిన పరిణామాల్ని చూస్తే..
కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు యెమెన్ కు 2008లో వెళ్లారు. కొన్నేళ్లు వివిధ ఆసుపత్రుల్లో పని చేశారు. అనంతరం సొంతంగా ఒక క్లినిక్ ను ఏర్పాటు చేశారు. ఆ దేశంలోని నిబంధనల ప్రకారం ఆ దేశంలో ఎవరైనా వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలంటే కచ్ఛితంగా ఆ దేశానికి చెందిన స్థానికుల్ని భాగస్వామిని చేసుకోవాలి. అయితే.. ఆమెకు 2014లో తలాల్ అబ్దో మహది అనే వ్యక్తి పరిచయమయ్యాడు. దీంతో.. అతడ్ని వ్యాపార భాగస్వామిగా పేర్కొంటూ బిజినెస్ స్టార్ట్ చేశారు.
క్లినిక్ ప్రారంభించిన కొంత కాలానికే ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. దీంతో.. అతడి తీరుతో విసిగిపోయిన ఆమె అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడు జైలు పాలయ్యాడు. కొంతకాలం జైల్లో ఉన్న అనంతరం తిరిగి బయటకు వచ్చిన అతను.. ఆమెను వేధించటం మొదలు పెట్టాడు. దీంతో నిమిషా తట్టుకోలేకపోయింది. ఆమె పాస్ పోర్టును తన వద్దే ఉంచుకున్న అతను ఇబ్బంది పెట్టసాగాడు.
దీంతో.. అతడ్ని వదిలించుకోవటానికి ప్లాన్ చేసిన ఆమె.. 2017లో ఒక ఇంజక్షన్ తో అతడ్ని చంపేసింది. పాస్ పోర్టును తీసుకొని ఇండియాకు తిరిగి వస్తున్న క్రమంలో ఆమెను యెమెన్ పోలీసులు పట్టుకొన్నారు. 2017 నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. ఈ కేసులో ఆమెను దోషిగా నిర్ణయిస్తూ 2018లో జీవితఖైదు విధిస్తూ తీర్పును ఇచ్చారు. అనంతరం దాన్ని మరణశిక్షగా తేల్చారు.
దీంతో నిమిషాను కాపాడుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు బ్లడ్ మనీకి సిద్ధమైంది. తలాల్ కుటుంబానికి రూ.70 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనుకున్నట్లే విరాళాలతో ఆ మొత్తాన్ని సమకూర్చారు. అయితే.. చివర్లో న్యాయవాది అనూహ్య రీతిలో స్పందిస్తూ.. తన ఫీజు కింద 40 వేల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది. అంత మొత్తాన్ని సమకూర్చలేని నిమిషా కుటుంబం కిందా మీదా పడుతున్నరు . మొత్తం డబ్బులు ఇస్తేనే బ్లడ్ మనీ చర్చలు జరుపుతామని తేల్చి చెప్పటంతో.. నిమిషా కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ఈ నెలలోనే ఊరిశిక్ష ఖరారు చేయటంతో నిమిషా కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
This post was last modified on July 9, 2025 3:15 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…