మొత్తానికి ఐపీఎల్‌కు తెరపడింది. కరోనా టైంలో ఏ ఎంటర్టైన్మెంట్ లేక అల్లాడిపోతున్న జనాలకు ఈ టోర్నీనే గొప్ప ఉపశమనాన్ని అందించింది. మామూలుగానే ఐపీఎల్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈసారి రెట్టింపు వినోదాన్నందిస్తూ ఉర్రూతూలిస్తూ సాగింది టోర్నీ. లీగ్ ఇండియాలో జరగలేదు, స్టేడియాల్లో అభిమానులు లేరు అన్న మాటే కానీ.. ఎంటర్టైన్మెంట్‌కు మాత్రం ఢోకానే లేదు.
ఒక్క మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు జరిగాయంటే.. టోర్నీ చరిత్రలోనే ఎన్నడూ లేనన్నిసార్లు స్కోర్లు సమం అయ్యి మ్యాచ్‌లు సూపర్ ఓవర్లకు దారి తీశాయంటే.. లీగ్ దశ చివరి వరకు ప్లేఆఫ్ బెర్తుల లెక్క తేలలేదంటే.. ఈ టోర్నీ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రెండు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్‌ను ఐపీఎల్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు.
మామూలుగా ఐపీఎల్‌లో ఒకట్రెండు జట్లు పేలవ ప్రదర్శనతో చాలా ముందే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుని అతి తక్కువ విజయాలతో పాయింట్ల పట్టికలో దిగువన ఉండిపోతాయి. కానీ ఈసారి అలా జరగలేదు. ఏడు విజయాలతో రెండు జట్లు ప్లేఆఫ్ చేరితే.. ప్లేఆఫ్‌కు దూరమైన నాలుగు జట్లూ ఆరు విజయాలతో నిలవడం విశేషం. ఇలా ఇంతకుముందెన్నడూ జరగలేదు.
ఈ ఐపీఎల్‌కు మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఇండియాలో ఎప్పుడు లీగ్ జరిగినా బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం. బౌలర్ల పాత్ర నామమాత్రం అయిపోతుంటుంది. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఫ్లాట్ పిచ్‌లే కావడం, ఎక్కడా బౌలర్లకు పెద్దగా అవకాశం లేకపోవడంతో బ్యాట్స్‌మెన్ వీర లెవెల్లో రెచ్చిపోతుంటారు. టోర్నీ ఆద్యంతం అదే పరిస్థితి. కానీ యూఏఈలో అలా కాదు.
టోర్నీ ఆరంభంలో షార్జాలో కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ హవా సాగింది కానీ.. వాటిని మినహాయిస్తే బ్యాటుకు, బంతికి మధ్య రసవత్తర పోరు సాగింది. అన్ని జట్లలో బౌలర్లు అదరగొట్టారు. ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లు చెలరేగారు. భారీ స్కోర్లు చేయడం కష్టమైంది. ఓ మోస్తరు లక్ష్యాల్ని ఛేదించడానికీ అవస్థలు పడ్డారు. పిచ్‌లు ఒక్కో మ్యాచ్‌కు ఒక్కోలా స్పందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. దీని వల్ల టోర్నీ మరింత ఎగ్జైటింగ్‌గా సాగింది.
మొత్తంగా చూస్తే మన ఫ్యాన్స్ వెళ్లి స్టేడియాల్లో మ్యాచ్‌లు చూడలేకపోయారన్న మాటే కానీ.. లీగ్‌లో ఎంటర్టైన్మెంట్‌కు మాత్రం ఢోకా లేదు. టీవీల్లో మ్యాచ్‌లు చూసిన వాళ్లకు మజానే మజా. ఫైనల్ ఏకపక్షంగా సాగి, అందరూ అనుకున్నట్లే ముంబయి విజేతగా నిలవడం ఒక్కటే నిరాశ కలిగించే విషయమే. దాన్ని మినహాయిస్తే ఐపీఎల్ 13వ సీజన్ సూపర్ హిట్టన్నట్లే.
This post was last modified on November 11, 2020 4:48 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…