గుజరాత్ పారిశ్రామిక రాజధాని అహ్మదాబాద్ నుంచి లండన్‌కు టేకాఫ్ అయిన.. బోయింగ్ 171 విమానం గురువారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కుప్పకూలి పోయింది. ఘటన జరిగిన 30 నిమిషాల వరకు కూడా.. బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు. ఆ తర్వాత.. వెలుగు చూసిన ఈ ఘోర విషాదంలో 242 మంది(మొత్తం సిబ్బంది, ప్రయాణికులు కూడా) మాంసపు ముద్దలుగా మిగిలారు. అయితే.. దేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే రెండో అతి పెద్ద ప్రమాదమని నిపుణులు, గణాంకాలు కూడా చెబుతున్నాయి.
ఎప్పుడెప్పుడు.. ఎంతెంత మంది?
340 మంది: 1996 హరియాణాలో జరిగిన విమాన ప్రమాదంలో అత్యంత ఎక్కువగా 340 మంది మృతి చెందారు. సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్ ‘విమానం 763’ కజికిస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానం 1907 ఢీకొన్నాయి.
242 మంది: తాజాగా గుజరాత్‌లోని ఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా లండన్‌కు వెళ్లేందుకు బయలు దేరిన బోయింగ్ 171 కుప్పకూలింది. దీనిలో అందరూ మృతి చెందారు. ఇదే రెండో అతి పెద్ద విమాన ప్రమాదం.
238 మంది: ఇది దేశంలో జరిగిన మూడో అతి పెద్ద విమాన ప్రమాదం. 1990 ఫిబ్రవరిలో బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సహా 238 మంది ప్రాణాలు కోల్పోయారు.
158 మంది: ఇది దేశంలో జరిగిన 4వ అతి పెద్ద విమాన ప్రమాదం. 2010 మేలో బెంగళూరులోని పారిశ్రామిక ప్రాంతం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్-812 కుప్పకూలింది. దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చిన విమానం… సకాలంలో రన్‌వేపై ఆగలేకపోయింది. దీంతో మంటలు చెలరేగడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు.
118 మంది: ఇది 5వఅతిపెద్ద విమాన ప్రమాదం. 1993 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం టేకాఫ్ సమయంలో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి 118 మంది ప్రయాణికులు చనిపోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates