గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు,10 మంది విమాన సిబ్బంది, ప్రయాణికులు 242 మంది ఉన్నారు. అయితే, ఆ ప్రయాణికులలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రకారం రూపానీ పేరు ఉన్న ఎయిరిండియా విమానం ప్యాసెంజర్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రూపానీతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వీఐపీలు ఆ విమానంలో లండన్ కు ప్రయాణిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
విమానం ఎక్కారని ఎయిరిండియా సిబ్బంది కన్ఫర్మ్ చేసిన జాబితాలో రూపానీ పేరు ఉంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నం 12.10కి బోర్డింగ్ చేసినట్లు ఆ జాబితాలో ఉంది. లండన్ లో నివసిస్తున్న తన కుమార్తెను చూసేందుకు రూపానీ వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రూపానీ గాయపడ్డారా లేదా? ఆయన ఎలా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు అన్న సమాచారం తెలియాల్సి ఉంది. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత రూపానీ పనిచేశారు.
మరోవైపు, ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు టేకాఫ్ అయిన విమానం..1.35కు క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒక కెనడా పౌరుడు ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ కు ఈ విమానం వెళుతుండగా ప్రమాదం జరిగింది.
This post was last modified on June 12, 2025 4:42 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…