ఒకప్పుడు కేవలం ప్రయాణాల కోసం ఉపయోగించే ఆటో ఇప్పుడు సంపాదనకి మార్గం అయింది. ముంబైకు చెందిన ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఏ పని చేయకుండానే నెలకు 5 నుంచి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇది విని ఆశ్చర్యపడాల్సిన పని కాదు, ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్ ఏదో కష్టపడి ఆలోచించకుండా చాలా సింపుల్ గానే ఆలోచించాడు. వీసా అపాయింట్‌మెంట్‌లకు వచ్చే వారి అవసరాన్ని గుర్తించి, అతను ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు.
అమెరికన్ ఎంబసీ వద్ద భద్రతా కారణాల వల్ల బ్యాగులు లోపలికి అనుమతించరు. అదే సమయంలో ఎంబసీలో లాకర్ సౌకర్యం ఉండదు. దీన్ని గమనించిన ఈ ఆటో డ్రైవర్, అక్కడే తన ఆటోను పార్క్ చేసి, బ్యాగులు ఉంచుకునే స్థలంగా ఉపయోగిస్తున్నాడు. ఒక్కో బ్యాగ్‌కు రూ.1000 వసూలు చేస్తూ రోజుకు 20 నుంచి 30 మంది కస్టమర్లతో భారీ ఆదాయం సంపాదిస్తున్నాడు.
ఈ విషయాన్ని లెన్స్‌కార్ట్ అధిపతి రాహుల్ రూపానీ తన లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా బయటపెట్టారు. రూపానీ మాట్లాడుతూ, తన వీసా అపాయింట్‌మెంట్ కోసం వెళ్తుండగా, ఎక్కడైనా బ్యాగ్ ఉంచాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్ దగ్గరికి వచ్చి, “ఇక్కడే ఉంచండి సార్, నా ఛార్జీ రూ.1000” అని చెప్పినట్టు వెల్లడించారు. ఇది ఒక్కోరోజు రూ.20,000 నుంచి 30,000 వరకు ఆదాయం అన్నమాట.
అతను చట్టబద్ధంగా సంచులను నిల్వ చేయాలనే ఉద్దేశంతో స్థానిక పోలీసుల సాయంతో లాకర్ భాగస్వామ్యం చేసుకున్నాడు. ఆటోను గరాజ్‌గా మార్చి, సామాన్య స్థాయి వ్యాపారాన్ని ప్రొఫెషనల్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. ఇది ఒక చిన్న ఆలోచన, కానీ పెద్ద విజయానికి మార్గం. ఇతరులకు ఇది ఒక బుద్ధిమంతులైన వ్యాపార దృష్టికోణానికి మంచి ఉదాహరణ. ఉద్యోగాల కోసం పరుగులు తీయడం కాకుండా, సమర్థవంతమైన మార్గాలు ఎంచుకుంటే ఎలా సంపాదించవచ్చో ఈ ఆటో డ్రైవర్ చూపించి తీరాడు.