భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదంటూ కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహక పథకాలు అందిస్తున్నా కూడా, టెస్లా మాత్రం ఎలాంటి ఉత్సాహం చూపడం లేదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా టెస్లా షోరూమ్‌లు మాత్రం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈవీ పరిశ్రమ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ, టెస్లా ఈవీ తయారీకి ముందుగా ఉన్నట్టు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని చెప్పారు. ఒక్కసారి చర్చలకు హాజరైన టెస్లా ప్రతినిధులు, ఆపై సమావేశాల్లో కనిపించకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఇది టెస్లా ఉద్దేశ్యం పూర్తిగా మార్కెట్ ప్రాబల్యాన్ని పెంచడమేనని చెబుతోంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత ఏడాది భారత్‌కు రావాల్సి ఉండగా, చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేయడం కలకలం రేపింది. అప్పట్నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం నిలిచిపోయింది. అయితే, టెస్లా వాహనాలను ఇంపోర్ట్ చేసి భారత మార్కెట్‌లో అమ్మే ప్రణాళిక మాత్రం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రముఖ నగరాల్లో షోరూమ్‌లు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, మస్క్ భారత్‌లో ఫ్యాక్టరీ పెట్టడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగించే నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ-మస్క్ భేటీ, వాణిజ్య ఒప్పందాల నేపథ్యం కూడా అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. మొత్తానికి.. భారత మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలన్న టెస్లా లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ‘ఇక్కడ తయారీ.. అక్కడ అమ్మకం’ అనే ఫార్ములా భారత్‌కు ఎంతవరకు ఉపయోగకరమో అనేది సందేహమే. దీన్ని కేంద్రం ఎలా సమన్వయ పరుస్తుందో చూడాలి.
This post was last modified on June 2, 2025 6:39 pm
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…