ఆఖరి వరకూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 పోరులో ముంబయి ఇండియన్స్ ఓటమి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా, శ్రేయస్ అయ్యర్ పంజాబ్ తరఫున అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ముంబయిని ఇంటికే పంపేసిన తర్వాత, అంబానీ కుటుంబం నుంచి వచ్చిన రియాక్షన్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నితా అంబానీ ముఖభావాలు ప్రత్యేకంగా చర్చకు వస్తున్నాయి. మ్యాచ్ సందర్భంగా ఆమె స్టేడియంలో ముంబయి జెర్సీలో కనిపించగా, చివర్లో అయ్యర్ కూల్ గా గేమ్‌ను పంజాబ్‌కు కట్టబెట్టిన తరుణంలో ఆమె హావభావాల తీరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
“అయ్యర్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె కళ్లలో షాక్ స్పష్టంగా కనిపించింది” అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ దృశ్యం మీద ఎన్నో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు పంజాబ్ రాణి ప్రీతి జింతా మాత్రం ఎగిరి గంతేసింది. ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
26 కోట్లతో కొనుగోలు చేసిన శ్రేయస్ అయ్యర్ ఈ భారీ ఒప్పందానికి న్యాయం చేస్తూ ఫైనల్‌కు పంజాబ్‌ను తీసుకెళ్లడం నిజంగా రేర్ అండ్ స్పెషల్ మూడ్. ఒక్కడే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యాడు. ఇక అంబానీ రాణి షాక్ అవడం కూడా అందుకే న్యూస్ అయ్యింది. ఇక ఈ మ్యాచ్‌తో పంజాబ్ ఐతే మొదటిసారి ట్రోఫీకి దగ్గరైంది. మరోవైపు బెంగుళూరు కూడా ఫైనల్ లో గెలిచి మొదటిసారి ట్రోపీ అందుకోవాలని చూస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి.
This post was last modified on June 2, 2025 11:03 am
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…