ఐపీఎల్ 2025లో పది రోజుల విరామం తర్వాత మళ్లీ వేదిక వేడెక్కబోతుంది. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోమారు కోహ్లీ నినాదాలతో మార్మోగనుంది. కారణం– ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కంటే ముందుగా, ఈసారి అందరి దృష్టి విరాట్ కోహ్లీపై ఎక్కువగా ఉంది. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ, మళ్లీ తన అభిమానుల ముందు బరిలోకి దిగుతున్నాడు. ఇది ఆర్సీబీకి ఓ సుదీర్ఘ విరామం తర్వాత కీలకమైన పోరు కావడమే కాదు, కోహ్లీ భావోద్వేగాలకు తెరలేపే రాత్రిగా కూడా మిగలనుంది.
ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. ఒక గెలుపు ప్లే ఆఫ్స్ టికెట్‌ను లాక్ చేయబోతున్న తరుణంలో కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడి ఆట అత్యవసరం. విరామానికి ముందు జట్టు జోష్‌లో ఉండటం, ప్లేయర్ల ఫామ్ పునరుద్ధరమవుతుందా అన్న ప్రశ్నలతో మ్యాచ్‌కు ముందు ఉత్కంఠ పెరిగింది. మరోవైపు కేకేఆర్ మాత్రం మిడిల్ టేబుల్‌లో నిలవడంతో ఈ మ్యాచ్ వారికి కూడా డూ ఆర్ డై గా మారనుంది.
కోహ్లీ తాజా నిర్ణయం స్టేడియంలో అభిమాని స్పందనను పెంచగా, మ్యాచ్‌కి ముందు తెల్ల జెర్సీల్లో అభిమానులు తరలివచ్చే అవకాశముంది. అయితే, కోహ్లీ ఎప్పటిలాగే తన ఎమోషన్స్‌ను వదిలేసి బ్యాట్‌తో సమాధానం చెప్పే తరహాలో ఉండబోతున్నాడు. 36 ఏళ్ల వయసులోనూ తన మానసిక దృఢతతో జట్టుకు ముందుండే లీడర్‌గా నిలవాలని చూస్తున్న కోహ్లీ ఈ మ్యాచ్‌ను ‘వ్యక్తిగతంగా కాదు.. వ్యూహాత్మకంగా’ తీసుకుంటాడని విశ్లేషకుల అభిప్రాయం.