విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ పరిధిలోని నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు చేసిన దారుణం సభ్య సమాజాన్ని భయ కంపితులను చేస్తోంది. కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చిన ఇతడిని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదు. నవ మాసాలు మోసిన తల్లి ఓ వైపు, పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుడిని చేసిన తండ్రి మరోవైపు… వారిద్దరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే… ఈ కసాయి కొడుకు వికటాట్ట హాసం చేస్తూ వారిపైకి ట్రాక్టర్ ను ఎక్కించేశాడు. చూస్తుండగానే..తల్లిదండ్రుల ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాడు. ఆనక నేరుగా పోలీసులకు లొంగిపోయాడు.
ఈ ఘటన జరిగిన తీరును తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కొడుకు నడుపుకుంటూ వస్తున్న ట్రాక్టర్ ఎక్కడ తమ ప్రాణాలను తీస్తుందోనని ఆ తల్లిదండ్రులు ఇద్దరూ భయంతో పరుగులు తీసిన దృశ్యాలను గుర్తు చేసుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. కనిపెంచిన అమ్మానాన్నలు భయంతో పరుగుతు తీస్తుంటే..వారిపైకి అతడు ట్రాక్టర్ ను ఎక్కించిన తీరును గుర్తు చేసుకుంటే… సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అన్న ఏవగింపు పుడుతుంది. ఎక్కడో ఓ మూలనే జరిగినా ఈ ఘటన యావత్తు ప్రపంచాన్నే కలరవపాటుకు గురి చేసిందని చెప్పక తప్పదు.
రాజశేఖర్ తల్లిదండ్రులు పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (45)లు చేసిన తప్పేమీ కూడా లేదనే చెప్పాలి. తమకున్న ఎకరం పొలంలో రాజశేఖర్ తో పాటు అతడి సోదరి రాధాకుమారికి కూడా వాటి ఇవ్వడమే వారు చేసిన పొరపాటుగా చెప్పాలి. రాజశేఖర్ తో పాటు రాధాకుమారి కూడా వారి కడుపున పుట్టిన బిడ్డే కదా. రాధాకుమారికి పెళ్లి సందర్భంగా ఎకరం భూమిలో 20 సెంట్లను రాసివ్వగా… భర్త చనిపోవడంతో రాధాకుమారికి మరింతగా అండగా నిలిచేందుకు పొలాన్ని విక్రయించగా వచ్చే మొత్తాన్ని కూడా ఆమెకే ఇవ్వాని వారు భావించారు.
ఈ నిర్ణయమే రాజశేఖర్ ను రాక్షసుడిగా మార్చివేసింది. పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన రాధాకుమారికి ఇంకెంత కాలం సహకరిస్తారని అతడు ఊగిపోయాడు. ఉన్నదానిలో మెజారిటీ వాటాను కూతురికే ఇస్తే… ఇక తన జీవితం ఏం కావాలని ఆగ్రహానికి గురయ్యాడు. అంతే తన పేరిట ఉన్న పొలంలో కొంత భాగాన్ని అమ్ముతానని… అందుకోసం ట్రాక్టర్ తో ఆ భూమిని చదును చేసేందుకు ఓ ట్రాక్టర్ తో పొలానికి వెళ్లాడు. తల్లిదండ్రులు వారించినంతనే అతడిలోని కర్కోటకుడు బయటకు వచ్చాడు. అంతే వారు భయంతో పరుగులు పెట్టినా వదలకుండా వారిపైకి ట్రాక్టర్ ను ఎక్కించి వారి ప్రాణాలను తీశాడు. అనంతరం తన సతీమణితో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
This post was last modified on April 27, 2025 10:08 am
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…