అగ్రరాజ్యం అమెరికా కలలు కల్లలు అవుతున్నాయి. ఓ వైపు కరోనా కలకలకం కొనసాగుతుండగానే మరోవైపు ఆ దేశంలో నివసిస్తున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సమస్యాత్మకంగా మారడమే కాకుండా నివసించడమే ఇబ్బందిగా మారుతోంది.
ఔను. అమెరికాలో పని చేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగుల భవిష్యత్ కలలపై కరోనా నీళ్లు చల్లింది. జూన్ చివరినాటికి దాదాపు 2 లక్షల మంది హెచ్1బీ వీసాదారులు చట్టబద్ధంగా ఆ దేశంలో నివసించే హక్కును కోల్పోనున్నారు. ఇందులో షాకింగ్ పరిణామం బాధితుల్లోభారతీయులే అత్యధికం!
గత 2 నెలల్లో అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు వారిని వేతనం లేని సెలవుపై పంపడం, వేతనాన్ని తగ్గించడం లేదా వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతించడం వంటివి చేస్తున్నాయి.
హెచ్1బీ వీసాదారులు వేతనం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే అక్కడ చట్టబద్ధంగా నివసించేందుకు హక్కు ఉంటుంది. అంటే, వారి వీసా గడువు ఈ జూన్‌తో ముగియబోతోంది. సుమారు 2,50,000 మంది ఉద్యోగులు అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.
వారిలో దాదాపు 2 లక్షల మంది హెచ్1బీ వీసాదారులకు ఈ జూన్‌తో గడువు ముగియబోతోంది. ఇంతేకాకుండా నివాస హోదా కోరని మరో వేలాది మంది కూడా స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది.
మరోవైపు అమెరికాలో ఉన్న స్థానికులతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు ఇంకో సమస్య ఎదురవుతోంది. ఎందుకంటే, గడవు ముగిసిన తర్వాత నివసించడం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసాదారులు 60 రోజుల్లో మరో ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంటుంది.
లేనిపక్షంలో వేరే వీసాకు మారడం లేదా దేశాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కరోనా కారణంగా విదేశీ రాకపోకలను భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు అమెరికాలో ఉండలేక, ఇటు భారత్‌కు వచ్చే దారిలేక వారు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
This post was last modified on April 30, 2020 4:07 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…