Trends

మొబైల్ ఫోన్ సిగ్న‌ల్స్‌ ప్ర‌దాత.. రంగ‌న్ మృతి!

నేడు దేశంలో 60-70 శాతం మంది ప్ర‌జ‌లు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ల‌కు సిగ్న‌ల్స్ అందించే ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాల‌కు.. ఆద్యుడు.. భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగాల్లోనే సువ‌ర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన క‌స్తూరి రంగ‌న్‌.. ఉర‌ఫ్ కృష్ణ‌స్వామి క‌స్తూరి రంగ‌న్ ఇక లేరు. 84 ఏళ్ల వ‌య‌సులో బెంగ‌ళూరులో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం.. 1 గంట‌కు ఆయ‌న క‌న్నుమూశారు. గ‌త కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రంగ‌న్‌.. ఓ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు.

1940, అక్టోబ‌రు 24న కేర‌ళ‌లోని కొచ్చిన్‌లో జ‌న్మించిన రంగ‌న్‌.. భార‌త అంత‌రిక్ష రంగంలో అనేక ప్ర‌యోగాల‌కు `వేదిక‌గా` నిలిచారు. ముఖ్యంగా సాంతికేత వినియోగంలో ప్ర‌పంచ దేశాల‌కు దీటుగా భార‌త్ ను ముందుకు న‌డిపించాల‌ని క‌ల‌లు క‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 1980ల‌లో మొబైల్ ఫోన్ల‌కు సిగ్న‌ళ్ల‌కు అందించే వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం చుట్టారు. సుమారు 15 సంవ‌త్స‌రాల పాటు.. ఆయ‌న చేసిన కృషి ఫ‌లించి.. భార‌త్‌లో తొలిసారి మొబైల్ సిగ్న‌ళ్లు 1998-99 ప్రాంతంలో అందివ‌చ్చాయి.

ఆత‌ర్వాత‌.. జ‌రిగిన విస్తృత ప‌రిశోధ‌న‌లు.. మొబైళ్ల సిగ్న‌ళ్ల‌తోపాటు.. ఇత‌ర సాంకేతిక స‌హ‌కారాల‌ను కూడా అందించాయి. ఒక్క మొబైల్ సిగ్న‌ళ్లే కాకుండా.. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో మానవ ర‌హిత ప్ర‌యోగాల‌కు కూడా.. ఆయ‌న అప్ప‌ట్లోనే జీవం పోశారు. ఆయ‌న రాసిన‌.. 200ల‌కు పైగా ప‌త్రాలు.. నేటికీ శాస్త్ర‌వేత్త‌ల‌కు ప‌విత్ర గ్రంధాల‌తో స‌మానంగా భావిస్తారు. సుదీర్ఘ కాలం పాటు ఆయ‌న భార‌త అంత‌రిక్ష రంగానికి సేవ‌లు అందించారు.

ప్ర‌స్తుతం చిటికెలో మొబైల్ సిగ్న‌ళ్ల‌ను అందుకునే వ్య‌వ‌స్థ‌కు ఆయ‌నే జ‌వం… జీవం.. పోశారంటూ.. 2000 సంవ‌త్స‌రంలో ఆయ‌న‌కు ప‌ద్మ‌విభూష‌ణ్ ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా కేంద్రం వేనోళ్ల కొనియాడింది. కాగా.. ఆయ‌న కు కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే క్షేత్ర‌స్థాయిలో విద్యార్థు లకు అంత‌రిక్షంపై అవ‌గాహ‌న పెంచేందుకు పాఠ్యాంశాలు మార్చాలని సూచించారు. కానీ.. అది సాకారం కాలేదు.

This post was last modified on April 25, 2025 4:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమస్య చిన్నదయినా, పెద్దదయినా పవన్ కు ఒకటే

సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…

2 hours ago

ఓజి… వరప్రసాద్… పెద్ది?

మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…

2 hours ago

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం…

3 hours ago

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

4 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

5 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

6 hours ago