పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడి వెనుక ఉన్నది తామేనంటూ TRF (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ప్రకటించుకోవడంతో, ఈ సంస్థ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ దాడిలో 25 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో ‘టీఆర్ఎఫ్’ గురించి మరోసారి చర్చ మొదలైంది. అసలు ఈ టీఆర్ఎఫ్ ఎవరు? దీని వెనుక ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
2019 ఆగస్టులో కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాక్ ప్రోత్సహంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ, పాకిస్థాన్ ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (LeT)కు అనుబంధంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఏర్పడిన తక్కువ సమయంలోనే ఈ సంస్థ కశ్మీర్ లో తన ఉనికిని చాటుకుంది. హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థల సభ్యులను టీఆర్ఎఫ్‌లో చేర్చుకుని, దాడులకు సరికొత్త వ్యూహాలను రచించింది. భారత హోంమంత్రిత్వ శాఖ 2023 జనవరిలో ఈ సంస్థను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ప్రకారం నిషేధించింది.
ఈ సంస్థకు షేక్ సజ్జాద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, బాసిత్ అహ్మద్ దార్ ఆపరేషనల్ చీఫ్‌గా వ్యవహరించారు. ట్రెండింగ్ సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని, ఈ సంస్థ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన హింసను రెచ్చగొడుతోంది. కాశ్మీరీ పండిట్లు, స్థానిక పోలీసులు, కార్మికులు, పర్యాటకులు, వ్యాపారస్తులు వంటి సాఫ్ట్ టార్గెట్లను ఎంచుకుని హింసకు పాల్పడుతోంది. తాజాగా పహల్గామ్‌లో జరిగిన దాడి ఈ వ్యూహానికే ఉదాహరణగా చెబుతున్నారు.
2018లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టడంతో, లష్కరే తోయిబా తరఫున పాక్ గూఢచార సంస్థ (ISI) ఈ టీఆర్ఎఫ్‌ను సృష్టించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా దృష్టి మరల్చేందుకే కొత్త పేరుతో పాత ఉగ్ర సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి పాక్ ఈ వ్యూహానికి తెరతీసింది. ఈ సంస్థ గతంలో గందర్‌బల్‌లో ఓ వైద్యుడితో పాటు కార్మికులు సహా ఏడుగురిని పొట్టనబెట్టుకుంది. అంతేకాకుండా 2020లో కుప్వారా సెక్టార్‌లో జరిగిన పోరులో ఐదుగురు భారత జవాన్లు వీరమరణం పొందడం కూడా ఇదే సంస్థ పనే.
ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో ఈ సంస్థ కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. పహల్గామ్ ఘటన తర్వాత ఈ సంస్థపై మరింత నిఘా పెంచారు. మొత్తం మీద టీఆర్ఎఫ్ సంస్థ కశ్మీర్ లో మరోసారి నెత్తుటి మరకలు చల్లేందుకు సిద్ధపడుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎఫ్‌పై భద్రతా దళాల పోరాటం మరింత తీవ్రతరం కానుంది.
This post was last modified on April 23, 2025 8:06 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…